మరో నిందితుడినీ పట్టుకున్న టాస్‌్కఫోర్స్
ఇతడి నుంచి ఏడు చోరీ సెల్‌ఫోన్లు స్వాదీనం
మూడో నిందితుడి కోసం ముమ్మర గాలింపు
చాదర్‌ఘాట్ ఫైరింగ్ ఉదంతంపై పూర్తి స్పష్టత
డీసీపీ, గన్‌మ్యాన్‌లను పరామర్శించిన డీజీపీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఉన్న చాదర్‌ఘాట్‌లోని విక్టోరియా ప్లే గ్రౌండ్స్‌లో శనివారం సాయంత్రం చోటు చేసుకున్న కాల్పుల ఉదంతంపై పూర్తి స్పష్టత వచ్చింది . సెల్‌ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడిన స్నాచర్లు ముగ్గురిగా, వీళ్లు ఆటోలో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో తూటాలు దిగిన అన్సారీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా... మరో నిందితుడు అలీని టాస్‌్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పరారీలో ఉన్న మూడో నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు నేరానికి వినియోగించిన ఆటోను స్వా«దీనం చేసుకోవడానికి ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. మరోపక్క ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమాజీగూడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీసీపీ ఎస్.చైతన్యకుమార్‌తో పాటు గన్‌మ్యాన్ వీఎస్‌ఎన్ మూర్తిని డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి, నగర కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ ఆదివారం పరామర్శించారు.
ఆగస్టు నుంచి ఔట్ ఆఫ్ వ్యూ...
కాలాపత్తర్ పోలీసుస్టేషన్‌లో రౌడీషిటర్‌గా ఉన్న కామాటిపుర వాసి మహ్మద్ ఒమర్ అన్సారీ ఈ ఏడాది ఏప్రిల్‌లో జైలు నుంచి విడుదలయ్యాడు. ఇలాంటి అసాంఘికశక్తులు ప్రతి నెలా నిరీ్ణత తేదీల్లో స్థానిక పోలీసుస్టేషన్‌లో హాజరవ్వాల్సి ఉంటుంది. అలా కాకుంటే వాళ్లు ఔట్ ఆఫ్ వ్యూగా ఉన్నట్లు పరిగణిస్తారు. ఏప్రిల్‌లో జైలు నుంచి బయటకు వచ్చిన అన్సారీ జూలై వరకు కాలాపత్తర్ ఠాణాలో హాజరయ్యాడు. ఆగస్టు నుంచి ఔట్ ఆఫ్ వ్యూలోకి వెళ్లిపోయాడు. వృత్తిరీత్యా ఆటోడ్రైవర్ అయిన ఇతగాడు ఇటీవల కాలంలో మరో ఇద్దరితో కలిసి ముఠా కట్టాడు. ఈ త్రయం ఆటోలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ సెల్‌ఫోన్ స్నాచింగ్స్‌కు పాల్పడుతోంది. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా ఉన్న ఎస్.చైతన్యకుమార్ శనివారం మధ్యాహ్నం బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ కమిషనరేట్‌కు వచ్చారు. అక్కడి నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) కార్యాలయంలో అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో సీసీఎస్ నుంచి సైదాబాద్‌లో ఉన్న తన కార్యాలయానికి అధికారిక వాహనంలో బయలుదేరారు.
గన్‌మ్యాన్‌ను తోసి పారిపోయిన అన్సారీ...
తనను గట్టిగా పట్టుకున్న మూర్తితో పాటు డీసీపీనీ తోసేసిన అన్సారీ అక్కడ నుంచి పరిగెత్తాడు. ఈ ప్రయత్నంలో అతడి చొక్కా చిరిగిపోయింది. కింద పడిపోయిన మూర్తి, చైతన్య కుమార్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. గన్‌మ్యాన్‌కు సంబంధించిన 0.9 ఎంఎం పిస్టల్ కూడా కింద పడిపోయింది. ఆ విషయం గుర్తించి దాన్ని తన ఆ«దీనంలోకి తీసుకున్న డీసీపీ నిందితుడు అన్సారీ, తన గన్‌మ్యాన్ వెళ్లిన మార్గంలో విక్టోరియా ప్లే గ్రౌండ్స్ వైపు పరిగెత్తారు. ఆ సమీపంలోని ఓ సందులోకి వెళ్లిన అన్సారీ ఓ ఇంటికి బయట నుంచి మెట్లు ఉండటాన్ని గమనించారు. అతగాడు వాటి ద్వారా ఆ ఆ భవనం రెండో అంతస్తులోకి చేరుకున్నాడు. మూర్తి, డీసీపీ సైతం అతడి వెనకాలే అక్కడకు వెళ్లాడు. అన్సారీ అక్కడ నుంచి పక్క భవనం టెర్రాస్ పైకి దూకగా... గన్‌మ్యాన్ సైతం దూకేశాడు. డీసీపీ చైతన్యకుమార్ కిందికి దిగి మరో మార్గంలో అక్కడకు చేరుకోవడానికి వెనుదిరిగారు. తన వెంట పడుతున్న గన్‌మ్యాన్‌ను చూసిన అన్సారీ ప్యాంటు జేబులో దాచుకున్న కత్తిని తీసి హత్యాయత్నం చేశాడు.
గన్‌మ్యాన్‌ను రక్షించేందుకే కాల్పులు...
ఇది గమనించిన మూర్తి తనను రక్షించాలంటూ డీసీపీని ఉద్దేశించి ‘సార్ సార్’ అంటూ గట్టిగా అరిచాడు. ఈ అరుపులు విన్న డీసీపీ వెనక్కు తిరిగి చూసే సమయానికి అన్సారీ కత్తితో మూర్తిపై దాడికి సిద్ధమయ్యాడు. అతడిని రక్షించడంతో పాటు అన్సారీ ప్రాణాలకు ముప్పు ఉండకూడదనే ఉద్దేశంతో చైతన్యకుమార్ స్పందించారు. తన చేతిలో ఉన్న పిస్టల్‌తో అన్సారీ శరీరం దిగువ భాగంలో కాల్చారు. ఆ తూటా తనకు తగిలినా ఆగని అన్సారీ హత్యాయత్నం కొనసాగించాడు. దీంతో డీసీపీ అతడి పైకి మరో తూటా కాల్చాల్సి వచి్చంది. ఇలా రెండు తూటాలు తగిలిన అన్సారీ ఆ టెర్రాస్ పై నుంచి రోడ్డు పైకి దూకి, అక్కడ నుంచి విక్టోరియా ప్లేగ్రౌండ్స్‌లోకి వెళ్లి పడిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. డీసీపీ ఫిర్యాదు మేరకు బీఎన్‌ఎస్‌లోని 304, 109, 132 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న సుల్తాన్‌బజార్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఐపీ ధర్మారావు దర్యాప్తు చేపట్టారు. పారిపోయిన మరో ఇద్దరి కోసం గాలించిన టాస్క్‌ఫోర్స్ బృందాలు ఓ నిందితుడు అలీని ఆదివారం పట్టుకుని ఏడు చోరీ సెల్‌ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
డీసీపీకీ డ్రైవర్ సందీప్ సమాచారం
ఆ సమయంలో డీసీపీ వాహనంలో ఆయన డ్రైవర్ పి.సందీప్‌తో పాటు గన్‌మ్యాన్ వీఎస్‌ఎన్ మూర్తి ఉన్నారు. సాయంత్రం 4.50 గంటల సమయంలో వీరి వాహనం చాదర్‌ఘాట్ చౌరస్తా సమీపంలోని ఇసామియా బజార్ వరకు వెళ్లింది. ఆ సమయంలో ఓ ఆటోలో (నెం.9395) వచి్చన ముగ్గురు ఓ వ్యక్తి సెల్‌ఫోన్ తస్కరించి పారిపోవడాన్ని డ్రైవర్ సందీప్ చూశారు. ఆయన ఈ విషయాన్ని డీసీపీ దృష్టికి తీసుకువెళ్లడంతో సదరు ఆటోను వెంబడించాల్సిందిగా చైతన్యకుమార్ స్పష్టం చేశారు. చాదర్‌ఘాట్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ రద్దీ కారణంగా స్నాచర్ల ఆటో ఆగిపోయింది. ఈ విషయం గుర్తించిన సందీప్ అదే విషయాన్ని డీసీపీకి చెప్పారు. వాహనం దిగి వెళ్లి, ఆటోలోని వారిని పట్టుకోవాల్సిందిగా తన గన్‌మ్యాన్ మూర్తిని చైతన్యకుమార్ ఆదేశించారు. తక్షణం రంగంలోకి దిగిన మూర్తి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు. అదే సమయంలో డీసీపీ కూడా అక్కడకు చేరుకున్నారు. యూనిఫాంలో ఉన్న డీసీపీని చూసిన మిగిలిన ఇద్దరు స్నాచర్లు ఆటోలో అక్కడ నుంచి ఉడాయించారు.


