
హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనవసరంగా రోడ్లపైకి రావోద్దని సూచించారు. గూడ్స్ వాహనాలను రాత్రి 9 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు మాత్రమే తిరగడానికి అనుమతి ఇస్తున్నామని తెలిపారు.
జిల్లా బార్డర్ చెక్ పోస్ట్‌లలో సైతం తనిఖీని పటిష్టంగా అమలు చేస్తున్నామని అన్నారు. కొంత మంది కావాలని పాస్‌లను మిస్యూస్ చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా, కొంత మంది ప్రెస్ అంటూ నకిలీ స్టిక్కర్లను తమ వాహనాలకు అంటించుకుని బయట తిరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని, వీరిపై చలాన్స్ విధించడంతో పాటు, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు లాక్డౌన్ నిబంధనలను విధిగా పాటించాలని, లేకుంటే వారిపై కఠిన చర్యలు తప్పవని తెలపారు.
చదవండి: ఆకలి తీరుస్తూ.. ఆదుకుంటూ