రోజుకు లక్ష మందికి ఆర్థిక సాయం

CM KCR Review On Flood Relief Measures - Sakshi

దసరాకు ముందే డబ్బులు అందితే పేదలకు ఉపశమనం

నీళ్లు తొలగిపోయాకే విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ

వరద సహాయక చర్యలపై సమీక్షలో సీఎం కేసీఆర్‌ ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: ‘భారీ వర్షాలు, వరదల తో ఇళ్లలోకి నీరొచ్చి ఆహార పదార్థాలు, దుస్తు లు, చెద్దర్లు అన్నీ తడిసిపోయాయి. కనీసం వండు కుని తినే పరిస్థితుల్లో కూడా చాలా కుటుం బాల్లేవు. అందుకే వారికి తక్షణ సా యంగా ప్రతీ బాధిత కుటుంబానికి రూ.10 వేల చొప్పున సాయం అందించాలని నిర్ణ యించాం. ఈ కార్యక్రమం ముమ్మరంగా సాగాలి. దసరా పండుగకు ముందే డబ్బులు అందితే పేదలకు ఉపయోగంగా ఉంటుంది. అందుకే రోజుకు కనీసం లక్ష కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేలా పనిచేయాలి’ అని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. హైదరాబాద్‌లో వరద సహాయ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో శుక్రవారం సమీక్షించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

చాలా వరకు పునరుద్ధరించాం..
‘భారీ వర్షాలు, వరదలతో 15 చోట్ల 33/11 కేవీ సబ్‌ స్టేషన్లు దెబ్బతినగా, అన్నింటినీ మరమ్మతు చేసి, పునరుద్ధరించాం. 1,080 చోట్ల 11 కేవీ ఫీడర్లు దెబ్బతినగా అన్నింటినీ మరమ్మతు చేశాం. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరి ధిలో 1,215 ట్రాన్స్‌ ఫార్మర్లు దెబ్బతినగా, 1,207 ట్రాన్స్‌ ఫార్మర్లు మరమ్మతు చేసి, పున రుద్ధరించారు. మిగతా 8 ట్రాన్స్‌ ఫార్మర్లు నీటిలో మునగడంతో మరమ్మతు చేయలేక పోయాం. మూసీ వరదలతో గ్రామీణ ప్రాం తాల్లో వ్యవసాయ రంగానికి చెందిన 1,145 ట్రాన్స్‌ ఫార్మర్లు దెబ్బతినగా, 386 మరమ్మ తు చేశారు. మరో 759 మిగిలి ఉన్నవి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరి ధిలో 1,299 స్తంభాలు దెబ్బతినగా, అన్నిం టినీ మరమ్మతు చేశాం. మూసీ వరదలతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి చెందిన 5,335 స్తంభాలు దెబ్బతినగా, 3,249 మరమ్మతు చేశారు. మిగతా 2,086 స్తంభాల మరమ్మతు పనులు జరుగుతున్నాయి’అని ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి సీఎంకు వివరించారు. నీళ్లు నిలిచి ఉన్న ప్రాంతాల్లో కరెంటు పునరుద్ధరణ చేయడం ప్రమాదకరం కాబట్టి, నీళ్లు తొలగించిన ప్రాంతాలు, అపార్టుమెం ట్లకే కరెంటు పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ పాల్గొన్నారు.  

Election 2024

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top