
ఫొటోలు అప్‌లోడ్ చేసే అవకాశం లబ్ధిదారులకే..
బిల్లుల విడుదల మరింత వేగవంతం.. పారదర్శకతకు పెద్దపీట
హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులే బిల్లుల కోసం స్వయంగా ఫొటోలు అప్‌లోడ్ చేసే అవకాశం కల్పించినట్టు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. లబ్ధిదారులకు నిర్దేశిత సమయంలో బిల్లులను విడుదల చేయడానికి ఇది తోడ్పడుతుందన్నారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ కార్పొరేషన్ పీడీలు, ఇతర సిబ్బందితో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల యాప్ వినియోగంపై సమగ్రమైన అవగాహన కలి్పంచాలని సూచించారు. లబ్ధిదారుల వివరాలు, ఇంతవరకు చేసిన చెల్లింపులు తదితర సమాచారమంతా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచి ఎక్కడి నుంచైనా తెలుసుకునే విధంగా యూనివర్సల్ సెర్చ్‌తో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. తమ బిల్లు ఎక్కడ ఉంది..ఏ తేదీన, ఎంత మొత్తం ఏ బ్యాంక్ అకౌంట్‌లో జమ అయ్యింది తదితర వివరాలు పారదర్శకంగా అందరికీ అందుబాటులోకి తేవడంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గిపోతుందని చెప్పారు.
గురువారం నుంచి ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచి్చనట్టు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు/బిల్ కలెక్టర్లు తదితర స్థాయిల్లో ఉద్దేశపూర్వక జాప్య నివారణకు, అక్కడక్కడా జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి ఈ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ ఎం.చైతన్యకుమార్, సూపరిండెంటింగ్ ఇంజనీర్ భాస్కర్‌రెడ్డి, జనరల్ మేనేజర్ మమత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అప్‌లోడ్ చేసేది ఇలా...
⇒ మొదటగా మొబైల్ ఫోన్‌లో ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత బెనిఫిíÙయరీ లాగిన్‌లో మొబైల్ నంబరు ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది.
⇒ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత డ్యాష్ బోర్డులో లబ్ధిదారుడి పేరు, మొబైల్ నంబరు తదితర వివరాలతోపాటు ఫొటోలు తీయడం (క్యాప్చర్ ఫొటోగ్రాఫ్) అనే వాటి కింద ఇళ్ల నిర్మాణపు దశలు (గ్రౌండింగ్, బేస్‌మెంట్, వాలింగ్, స్లాబ్, నిర్మాణం పూర్తి) అని కనిపిస్తాయి.
⇒ లబ్ధిదారులు గ్రౌండింగ్ స్థాయి ఫొటోలు అప్‌లోడ్ చేయాలనుకుంటే గ్రౌండింగ్‌పై క్లిక్ చేస్తే దరఖాస్తుదారుడికి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. లబ్ధిదారులు ప్రతిపాదిత ఇంటి నిర్మాణ స్థలం నుంచే మొబైల్ ఫోన్‌లోని కెమెరాతో ఫొటోలు తీయాలి, ఇక్కడే కెమెరాలో జియో ట్యాగింగ్ నిమిత్తం మ్యాప్ సింబల్‌ను క్లిక్ చేసి వివరాలు నమోదు చేసి, ఒకసారి సరిచూసుకున్న తర్వాత సబి్మట్ చేయాలి. ఆ తర్వాత వెనక్కి వెళ్లి గ్రౌండింగ్ బటన్‌పై క్లిక్ చేస్తే వివరాలన్నీ కనిపిస్తాయి.
⇒ బేస్‌మెంట్ స్థాయిలో నిర్మాణ పనులు జరుగుతున్న ఇంటి వద్ద లబ్ధిదారుతోపాటు ముందువైపు నుంచి, పక్క నుంచి, పైనుంచి (టాప్ యాంగిల్) ఫొటోలు తీయాలి, ఈ ఫొటోలు గ్రౌండింగ్ సమయంలో తీసిన ప్రాంతం సమీపం నుంచే తీయాలి. ఆపై యాప్‌లో అడిగిన సమాచారాన్ని నమోదు చేసి సబి్మట్ చేయాలి.
⇒ ఇదే తరహాలో వాలింగ్ దశలోనూ, స్లాబ్ దశలోనూ, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఫొటోలు తీసి లబ్ధిదారులే నేరుగా బిల్లుల కోసం అప్‌లోడ్ చేయొచ్చు.
⇒ గ్రామ కార్యదర్శులు, ఎంపీడీఓలు, డీఈఈలు పీడీ, తదితర అధికారులు, ఈ విధంగా నమోదైన వివరాలను క్షేత్రస్థాయిలో సరిచూసుకున్న తర్వాతనే లబ్ధిదారులకు బిల్లులు విడుదల చేస్తారు.