మిత్రుడు పిలిస్తే కాదనగలమా! | - | Sakshi
Sakshi News home page

మిత్రుడు పిలిస్తే కాదనగలమా!

May 19 2026 4:50 AM | Updated on May 19 2026 4:50 AM

మిత్రుడు పిలిస్తే కాదనగలమా!

తమిళసినిమా: మలయాళ చిత్రాలు తమిళంలోనూ ప్రేక్షకుల ఆదరణను పొందుతున్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలా అక్కడ ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న చిత్రాన్ని తమిళంలో అదిరడి పేరుతో ఈ నెల 22న విడుదల చేయనున్నారు. అరుణ్‌ అనిరుధన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టోవినో థామస్‌, బాసిల్‌ జోసఫ్‌, వినీత్‌ శ్రీనివాసన్‌, నటి రియా శిబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. బాసిల్‌ జోసఫ్‌, ఆనంద్‌.ఎస్‌ కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని తమిళంలో ఫైవ్‌ స్టార్‌ సెంథిల్‌ తమిళనాడులో విడుదల చేస్తున్నారు. కాగా అదిరడి చిత్రం ప్రీ రిలీజ్‌ కార్యక్రమాన్ని ఆదివారం చైన్నెలోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించారు. కార్యక్రమంలో యువ క్రికెట్‌ క్రీడాకారుడు సంజు సామ్సన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిత్ర కథానాయకుడు, నిర్మాతల్లో ఒకరైన బాసిల్‌ జోసఫ్‌ మాట్లాడుతూ తాను స్వయంగా తమిళంలో డబ్బింగ్‌ చేసిన చిత్రం ఇదని చెప్పారు. అదిరఢి అనే పదాన్ని చిన్న తనం నుంచి వింటూ వచ్చాననీ అదే పేరును తమ చిత్రానికి నిర్ణయించడం సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ చిత్రాన్ని స్టైట్‌ తమిళ చిత్రం అనిపించే విధంగా రూపొందించినట్లు చెప్పారు. మలయాళంలో మాదిరిగానే తమిళంలోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. క్రికెట్‌ క్రీడాకారుడు, తన మిత్రుడు సంజు సామ్సన్‌ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు థ్యాంక్స్‌ అన్నారు. ఈ చిత్రంలో ఒక గెస్ట్‌ రోల్‌ చేయమని సంజు సామ్సన్‌ కోరగా. ఆయన నిరాకరించారన్నారు. క్రికెట్‌ క్రీడాకారుడు సంజు సామ్సన్‌ మాట్లాడుతూ మిత్రుడు ఆహ్వానిస్తే రాకుండా ఉండగలమా? బాసిల్‌ జోసఫ్‌ తనకు మంచి మిత్రుడు అని పేర్కొన్నారు. ఆయన చిత్రాలు చూసి చిన్న చిన్న విమర్శలు చేస్తానన్నారు. ఈ చిత్రంలో తనను ఆటోడ్రైవర్‌గా చిన్న పాత్రలో నటించమని అడిగారని, పెద్ద పాత్ర అయితే నటించే వాడినన్నారు. ఇకపోతే ఈ చిత్రం తమిళంలోనూ మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement