ఘనంగా శివ పార్వతుల కల్యాణ మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా శివ పార్వతుల కల్యాణ మహోత్సవం

May 19 2026 4:50 AM | Updated on May 19 2026 4:50 AM

తిరువొత్తియూరు: శీర్కాళి సమీపం తిరునంగూర్‌లో ఉన్న 12 శివాలయాల్లో స్వామి,అమ్మవార్లకు ఆదివారం రాత్రి దివ్యమైన తిరుకల్యాణ ఉత్సవం ఘనంగా జరిగింది. గ్రామం చుట్టూ 11 దివ్యదేశ పెరుమాళ్‌ కోవెలలు, ప్రసిద్ధి చెందిన 12 శివాలయాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం, పూర్వం మతంగ ముని ఇక్కడి మతంగ ఆశ్రమంలో తపస్సు చేయగా, పార్వతీ దేవి కన్యగా అవతరించి, అనంతరం శివుడిని వివాహం చేసుకుంది. ఆ సమయంలో మతంగ ముని కోరిక మేరకు పరమశివుడు నంది దేవుడితో కలిసి కల్యాణ కోలంలో దర్శనమిచ్చారని కథనం. ఈ ఘటనను పురస్కరించుకుని, ఏటా వైశాఖ మాసంలోని రోహిణి నక్షత్రం రోజున తిరునంగూర్‌లోని మతంగీశ్వరర్‌ ఆలయంతో సహా 12 శివాలయాల్లోని దేవతామూర్తులకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ వేడుకలో మతంగీశ్వరర్‌, అయిరావతేశ్వరర్‌, కై లాసనాథర్‌, ఇతర 12 ఆలయాల్లోని చంద్రశేఖర్‌ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, కల్యాణ ఉత్సవాలు జరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement