ద్రోహానికి ప్రతిరూపం పళణి | - | Sakshi
Sakshi News home page

ద్రోహానికి ప్రతిరూపం పళణి

Apr 6 2026 7:42 AM | Updated on Apr 6 2026 7:42 AM

తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డ స్టాలిన్‌ బహుబలి డైలాగులతో వ్యాఖ్యల తూటాలు విరుదునగర్‌లో కీలక అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం

విరక్తితోనే వ్యాఖ్యలు

విరుదునగర్‌ ఎన్నికల ప్రచారంలో డీఎంకే అధ్యక్షుడు సీఎం స్టాలిన్‌ బాహుబలి డైలాగులతో వ్యాఖ్యల తూటాలను పేల్చారు. ఈ చిత్రంలోని ‘విశ్వాసానికి ఒక రూపం

ఉంటే అది నువ్వే కట్టప్ప’ అనే గైలాగును గుర్తు చేస్తూ, ఇక్కడ ‘ద్రోహానికి ఒక రూపం ఇస్తే అది

పళనిస్వామి’ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. విరుదునగర్‌ జిల్లాలోని నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న కీలక అభ్యర్థులకు మద్దతుగా ఆదివారం ఎన్నికల ప్రచార సభకు స్టాలిన్‌ హాజరయ్యారు.

సాక్షి, చైన్నె: ఉదయాన్నే వాకింగ్‌తో ప్రజలతో పలకరింపు, ఆ తదుపరి బహిరంగ సభ, సాయంత్రం మరో బహిరంగ సభ అంటూ ఎన్నికల ప్రచారంలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ దూసుకెళ్తున్నారు. ఈ పరిస్థితులలో ఆదివారం ఉదయం విరుదునగర్‌లో జరిగిన ప్రచార సభలో ఆ జిల్లా పరిధిలోని నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న కీలక అభ్యర్థులకు మద్దతుగా ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు. ఇందులో రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు తిరుచ్చూలి నియోజకవర్గం, డీఎండీకే దివంగత నేత విజయకాంత్‌ వారసుడు విజయ ప్రభాకరన్‌ విరుదునగర్‌లో పోటీ చేస్తున్నారు.

అబద్ధాల పుట్ట

ఈ ప్రచార సభలో సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ, డీఎంకే ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చూసి ఓర్వే లేక పళనిస్వామి కేవలం అబద్ధాలు, దిగజారుడు వ్యాఖ్యలతో ప్రచారంలో నిమగ్నమై ఉన్నారని మండి పడ్డారు. పళనిస్వామి చెబుతున్న అబద్ధాలతో ఒక పుస్తకమే రాయవచ్చని ఎద్దేవా చేశారు.

చారిత్రక వాస్తవాలు

ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిధి గురించి పళనిస్వామి అసత్యాలు మాట్లాడుతున్నారని విరుచుకు పడ్డారు. కర్మయోగి కామరాజర్‌ మరణించినప్పుడు సొంత కుమారుడి వలే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించింది కరుణానిధి అని వివరించారు. ఇది చరిత్ర అని పేర్కొంటూ ఒకవేళ పళనిస్వామి చెబుతున్నది నిజమే అయితే, ఆ కాలంలో పెద్ద వివాదమే జరిగి ఉండేదన్నారు. అయితే, అప్పట్లో కాంగ్రెస్‌ నాయకులు కూడా కరుణానిధిని ఎందుకు కొనియాడారని ప్రశ్నించారు.

ఇంటి భారం తగ్గించేందుకే..

గృహిణిలుకు ఇంటి భారం తగ్గించాలన్న ఉద్దేశంతో రూ. 8 వేలు కూపన్‌ అంశాన్ని మేనిఫెస్టోలో పొందు పరిచామన్నారు. గృహిణులకు ఈ కూపన్‌ అధికారంలోకి రాగానే అందజేస్తామని, దీని ఆధారంగా వాషింగ్‌ మెషీన్‌, ఫ్రిజ్‌, టీవీ, గ్రైండర్‌, మిక్సీ లేదా మైక్రోవేవ్‌ ఓవెన్‌ వంటి గృహోపకరణాలను కొనుగోలు చేసుకునే వీలు కల్పించనున్నామన్నారు. ఎవరికి నచ్చిన షాపులో, నచ్చిన రంగులో, నచ్చిన వస్తువును కొనుగోలు చేసే స్వేచ్ఛ గృహిణులకే ఉంటుందన్నారు. అంతే కాదు. పాత వస్తువులను ఇచ్చి ఎక్స్‌చేంజ్‌ కూడా చేసుకోవచ్చు అని సూచించారు. అయితే, ఈ పథకంపై కూడా పళనిస్వామి చేస్తున్న విమర్శలను గుర్తు చేస్తూ, వాటిని కొట్టి పారేశారు. తాజా ఎన్నికలలో తమ మేనిఫెస్టో సూపర్‌ స్టార్‌ అని పేర్కొంటూ, కేవలం గెలుపు కోసం ఈ ఎన్నికలలో తాము పోరాటం చేయడం లేదని, తమిళనాడు హక్కుల కోసం చేస్తున్నామన్నారు. బీజేపీ, వారి కూటమి తమిళనాడు అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని ధ్వజమెత్తారు. ఈ డెమోక్రటిక్‌ వార్‌లో ప్రజలు డీఎంకే కూటమిని ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందని, ద్రావిడ మోడల్‌ 2.ఓ ప్రభుత్వంలో మరిన్ని రికార్డులను తిరగ రాస్తామని ధీమా వ్యక్తం చేశారు.

పళణి స్వామి విరక్తి అంచనా ఉన్నారని పేర్కొంటూ, ప్రభుత్వ ఉద్యోగులను డీఎంకే మోసం చేసిందని ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సాధ్యం కాదు అనుకున్న హామీలను కూడా తాము నెరవేర్చామని, లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను తమ పనితీరు, వారికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి , వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపినట్టు వివరించారు. ఇవన్నీ చూసి ఈర్ష్యతో విరక్తి అంచునకు పళణి చేరి ఉన్నారన్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులను, ఉపాధ్యాయులను అవమానించిన పళనిస్వామికి కనీసం ఓట్లు పడే అవకాశమే లేదన్నారు. ఈ సందర్భంగా పళనిస్వామి చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ, ఆయనను ద్రోహానికి నిలువెత్తు రూపంగా స్టాలిన్‌ అభివర్ణించారు. ద్రోహానికి కేరాఫ్‌ అడ్రస్‌ పళనిస్వామి అని మండి పడ్డారు. పళనిస్వామి కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాదు, తమిళనాడులోని ప్రతి వర్గానికి ద్రోహం చేశారని స్టాలిన్‌ మండిపడ్డారు. మూడు వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇచ్చి రైతులను వంచించారని, పొల్లాచ్చి లైంగిక వేధింపు కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం చేశారని, సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం), వక్ఫ్‌ సవరణ చట్టం వంటి బీజేపీ తెచ్చిన అన్ని చట్టాలకు మద్దతు ఇచ్చి మైనారిటీలను మోసంచేశారని మండి పడ్డారు. చివరకు తనను పెంచి పెద్ద చేసిన సెంగోట్టయన్‌, పదవి ఇచ్చిన శశికళ, దినకరన్‌, ఓపీఎస్‌ (పన్నీర్‌ సెల్వం)కు ద్రోహం చేసిన ఘనత పళణిస్వామికే దక్కుతుందన్రాను. చివరకు దివంగత జయలలిత సిద్ధాంతాలకు విరుద్ధంగా బీజేపీతో చేతులు కలిపి, ఇప్పుడు అన్నాడీఎంకేను నామ రూపాలు లేకుండా చేయడానికి సన్నద్ధమై ఉన్నారని ధ్వజమెత్తారు. కలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement