సాక్షి, చైన్నె : ఈస్టర్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ఆదివారం చర్చిల్లో పెద్దఎత్తున నిర్వహించారు. ఏసుక్రీస్తును స్మరిస్తూ ఫాస్టర్లు ప్రత్యేక సందేశాలు ఇచ్చారు. వివరాలు.. లోక రక్షణకు ఈ భువి మీద జన్మించిన కరుణామయుడు ఏసుక్రీస్తు. శాంతి, కరుణ, ప్రేమ అన్న సూక్తులతో జగత్ రక్షకుడిగా ముందుకు సాగారు. దుష్ట శక్తుల చేతిలో శిలువ వేయబడ్డ మూడో రోజున ఆ శాంతి స్వరూపుడు పునరుత్తానం చెందారు. ఈ రోజునే క్రైస్తవులు ఈస్టర్ పర్వదినంగా భావిస్తూ, ప్రత్యేక ప్రార్థనలతో లీనం కావడం జరుగుతోంది. ఏసు క్రీస్తు శిలువ వేయబడటం, మరణాన్ని గుర్తు చేస్తూ గత నెల మొదటి వారం నుంచి నుంచి 40 రోజుల పాటూ తవకాలం దీక్షలను క్రైస్తవ సోదరులు పూర్తిచేశారు. మట్టల ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. గుడ్ ఫ్రైడే రోజున శుక్రవారం ఏసుక్రీస్తు శిలువ వేయబడ్డ ఇతి వృత్తాంతం, పడ్డ అవస్థలను గుర్తుచేస్తూ కార్యక్రమాలు జరిగాయి. ఈ పరిస్థితులలో ఆదివారం ఈస్టర్ పర్వదినం ఘనంగా జరుపుకున్నారు. చర్చీలలో పండుగ వాతావరణం మిన్నంటింది. విద్యుత్ దీప కాంతుల నడుమ, పువ్వులతో దేవాలయాలన్నీ అలకరించారు.
ప్రత్యేక ప్రార్ధనలు..
అతిపెద్ద చర్చ్‌లు, మేరి మాత ఆలయాలు అంటూ, అన్ని ప్రార్థనాలయాలు క్రైస్తవ సోదర సోదరీమణులతో కిట కిటలాడాయి. కొన్ని దేవాలయాల్లో శనివారం అర్థరాత్రి నుంచే ప్రార్థనలు ప్రారంభం అయ్యాయి. క్రీస్తు బోధనల్ని వింటూ, సందేశాలను పండుగను జరుపుకున్నారు. ఇక, క్రీస్తు పునారుద్దానంను చాటే రీతిలో విద్యుత్ వెలుగులు విరాజిల్లే రీతిలో ఆయా దేవాలయాల్లో ఏర్పాట్లు జరిగాయి. చైన్నెలోని సెంతామస్ చర్చ్, బీసెంట్ నగర్ అన్నై వేలాంకన్నీ ఆలయం, ఎగ్మూర్ హృదయ ఆండవర్, , చిన్నమలై చర్చ్, మైలాపూర్ లజ్ చర్చ్ పరింగిమలై తదితర దేవాలయాల్లో ఈస్టర్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈస్టర్‌ను ఘనంగా ఆనిర్వహించారు. నాగపట్నం జిల్లా వేలాంకన్ని ఆలయంలో ప్రత్యేక తిరుబలి కార్యక్రమం జరిగింది.


