తమిళసినిమా: ఏడు పదులు దాటిన వయసులోనూ వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్న నటుడు రజనీకాంత్.నెల్సన్ దర్శకత్వంలో జైలర్ 2 చిత్రాన్ని ఇటీవలే పూర్తి చేసిన ఈయన తాజాగా యువ దర్శకుడు సిబి.చక్రవర్తి దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇది రజనీకాంత్ నటించే 173 చిత్రం అవుతుంది. కాగా ఈ చిత్రాన్ని నటుడు కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల(ఏప్రిల్)లోనే సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.ఇందులో మలయాళ నటుడు బాజిల్ జోసఫ్ కీలక పాత్రను పోషించనున్నారు. ఇకపోతే ఇందులో నటి ప్రియాంక మోహన్ నటించినున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే ఈ చిత్ర షూటింగ్‌ను మూడు నెలల్లోనే పూర్తి చేయలనే నిర్భందానికి దర్శకుడు సిబీ.చక్రవర్తి గురౌతున్నట్లు తాజా సమాచారం. కారణం నటుడు రజనీకాంత్ తన చిర కాల మిత్రుడు, సహ నటుడు కమలహాసన్‌తో కలిసి మరో చిత్రం చేయడానికి సిద్దం అవుతున్నారు. దీన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రానికి నెల్స్‌న్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ రానున్న ఆగస్ట్ నెలలో ప్రారంభం అవుతుందని నటుడు రజనీకాంత్ ఆదివారం చైన్నెలోని విమానాశ్రయంలో మీడియాకు చెప్పారు. దీంతో ఆయన నటించనున్న 173వ చిత్రాన్ని మూడు నెలలో పూర్తి చేయాల్సిన పరిస్ధితి నెలకొంది. అదే విధంగా ఈ చిత్రాన్ని 2027లో జనవరిలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
తమిళసినిమా: బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అయిన నటుడు కవిన్. మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఈయన బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోకు వెళ్లిన తరువాత పాపులర్ అయ్యారు. దీంతో సినిమాల్లో హీరోగా నటించే అవకాశాలు వరించాయి. అలా లిప్ట్ అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యి పేరు తెచ్చుకున్న కవిన్ ఆ తరువాత నటించిన డాడా చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయితే ఆపై నటించిన ఈయన నటించిన స్టార్, బ్లడీ బెగ్గర్, మాస్క్ చిత్రాలు పూర్తిగా నిరాశ పరిచాయి. అయితే నటుడిగా మంచి మార్కులనే తెచ్చుకున్నారు. ప్రస్తుతం కవిన్ నటిస్తున్న చిత్రాల్లో హాయ్ ఒకటి. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో నయనతార నాయకిగా నటించడం.ఈ చిత్రం ద్వారా విష్ణు ఎడవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు లోకేశ్ కనకరాజ్ శిష్యుడన్నది గమనార్హం. దీంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. కాగా ఈ చిత్రంలో జరిగిన ఒక సంఘటన గురించి దర్శకుడు విష్ణు ఎడవన్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ఇంతకు ముందు నయనతార నిర్మాతగా కవిన్ హీరోగా ఊర్‌కురువి అనే చిత్రం నిర్మించాల్సి ఉందన్నారు. అప్పుడే నయనతారకు కవిన్ తెలుసన్నారు. ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల ప్రారంభం కాలేదనీ, ఇప్పుడు నయనతార,కవిన్ నటిస్తున్న హాయ్ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రం తొలి రోజు షూటింగ్‌లో నయనతారను కవిన్ కౌగిలించుకునే సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు చెప్పారు. అయితే నయనతారను కౌగిలించుకోవడానికి కవిన్ సంకోశించారన్నారు. దీంతో ఇంతకు ముందు ఎవరినీ కౌగిలించుకోలేదా? అని ఆమె కవిన్‌ను సరదాగా ఆట పట్టించారన్నారు. ఇలా నయనతార సెట్‌లో ఉంటే జాలీగా ఉంటారని చెప్పారు. కాగా హాయ్ చిత్రం నిర్మాణ దశలో ఉంది. నయనతార నటించిన చిత్రాలు ఇటీవల తెరపైకి రాకున్నా, త్వరలో మలయాళంలో ముమ్ముట్టి, మోహన్‌లాల్‌లతో కలిసి నటించిన పెట్రియట్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. తెలుగులో చిరంజీవికి జంటగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ సరసన ఒక చిత్రం చేస్తున్న నయనతార హిందీలో సల్మాన్‌ఖాన్‌కు జంటగా ఒక చిత్రాన్ని కమిట్ అయ్యారు. ఇకపోతే తమిళంలో మన్నాంగట్టి, రాకాయి చిత్రాలు చేతిలో ఉన్నాయి. మలయాళంలో యశ్‌తో కసిన నటించిన టాక్సిక్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది.ఇలా పలు భాషల్లో నటిస్తూ నయనతార బిజీగా ఉన్నారు. ఇక ఈమె తన భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో నిర్మించిన ఎల్‌ఐకే చిత్రం ఈ నెల 10న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది.
ఇంతకు ముందు ఎవరినీ..?


