సాక్షి, చైన్నె : టీవీకే అధ్యక్షుడు విజయ్‌లో తాను దాఖలు చేసిన నామినేషన్ విషయంలో తీవ్ర గందరగోళానికి గురి అయ్యారు. వయస్సు, ఆస్తుల వివరాలలో తేడా గురించి, వాటిని సవరించే కసరత్తు చేపట్టారు. వివరాలు.. చైన్నె పెరంబూరు, తిరుచ్చి వెస్ట్ నియోజకవర్గాలలో విజయ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు చోట్ల ఆయన దాఖలు చేసిన నామినేషన్లలో భిన్నఅంశాలు ఉన్నట్టు గుర్తించి ఉన్నారు. పెరంబూరులో తన వయస్సు 52 సంవత్సరాలుగా, తిరుచ్చి వెస్ట్‌లో 51 సంవత్సరాలుగా పేర్కొని ఉన్నట్టు తేలింది. అలాగే, ఆస్తులకు సంబంధించిన వివరాలలోసైతం గందర గోళం గుర్తించారు. ఇప్పటికే పెరంబూరులో అదనపు సమాచారంతో ప్రమాణ పత్రం అందజేసినా, చివరకు సోమవారం ఈరెండు చోట్ల ఒకే రకమైన ప్రమాణ పత్రం ఉండే విధంగా విజయ్ తరపు న్యాయవాదులు కసరత్తు చేపట్టారు. పెరంబూర్ నామినేషన్‌లో తన ఆస్తుల విలువను రూ. 410 కోట్లుగా చూపగా, తిరుచ్చి పత్రాల్లో అది రూ. 404 కోట్లుగా ఉండటంతో ఈ తేడాలపై ఎన్నికల అధికారులు విచారణ చేపట్టి ఉన్నారు. విజయ్ అభ్యర్థిత్వంపై ఏవైనా ఈ గందరగోళం ఇబ్బందులు సృష్టిస్తాయో అన్న ఆందోళన టీవీకే శ్రేణుల్లో నెలకొంది. అయితే, నామినేషన్ల సవరణకు సోమవారం చివరి అవకాశం ఉన్నందున, విజయ్ తరపున ప్రత్యేక న్యాయవాదుల బృందాలు ఈ లోపాలను సరిదిద్దే పనిలో నిమగ్నమయ్యాయి. కాగా, విజయ్ సోమవారం చైన్నెలో పలు నియోజకవర్గాలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా, తిరుచ్చి వెస్ట్ నియోజకవర్గంలో విజయ్ ఎన్నికల కార్యాలయం ఏర్పాటు చేసినా, అక్కడ సందడి కాన రాక పోవడంతో చర్చ మొదలైంది. టీవీకే వర్గాలు పెద్దగా తిరుచ్చి వెస్ట్‌ను పట్టించుకున్నట్టు లేరన్న చర్చ తెరమీదకు వచ్చింది.
మంత్రి శివశంకర్‌ని
వీడని ఫ్లయింగ్ స్క్వాడ్
● మళ్లీమళ్లీ సోదాలు
సాక్షి,చైన్నె : అరియలూరులో మంత్రి శివశంకరన్‌ను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ విడిచి పెట్టేలా లేదు. పదే పదే ఆయన వాహనాన్ని తనిఖీలు చేస్తుండటం ప్రాధాన్యతకు దారి తీసింది. అరియలూరు జిల్లాలోని అభ్యర్థులకు మద్దతుగా , తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఓటర్ల ను ఆకర్షించే రీతిలోరవాణా మంత్రి శివశంకర్ దూసుకెళ్తున్నారు. రోజూ ఆయన ప్రచారానికి వెళ్లే మార్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్‌లు తిష్ట వేసి ఉండటంతో తనిఖీలు తప్పడం లేదు. ఆదివారం కున్నం నుండి అరియలూర్ వైపు మంత్రి ప్రయాణిస్తుండగా, సెందురై జంక్షన్ సమీపంలో అధికారులు ఆయన వాహనాన్ని ఆపారు. అధికారులు తన వాహనాన్ని ఆపిన వెంటనే మంత్రి శివశంకర్ ఎంతో ఓపికతో కారు దిగి, తనిఖీలకు పూర్తిస్థాయిలో సహకరించారు. కారులో ఎటువంటి నగదు కానీ, ఓటర్లకు పంచేందుకు ఉద్దేశించిన బహుమతులు కానీ లభించలేదు. దీంతో అధికారులు ఆయనను వెళ్లడానికి అనుమతించారు. అరియలూర్ నుంచి జయంగొండం నియోజకవర్గాల వరకు 9 సిట్టింగ్, మరో 9 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఉన్నాయి. దీంతో అటు వైపుగా వెళ్లే సమయాలలో మంత్రిని ఈ బృందాలు టార్గెట్ చేయక తప్పలేదు. హస్తినాపురం సమీపంలో ఓ మారు తనిఖీ జరగ్గా, మరో మారు తాజాగా సెందురై జంక్షన్‌లో సోదాలు జరగడం గమనార్హం.
ఒకే ఏడాదిలో రూ. 8,269
కోట్ల రికార్డు వసూళ్లు
●76 కోట్ల మంది ప్రయాణించారన్న అధికారులు
కొరుక్కుపేట: రపస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ రైల్వే జోనన్‌లో ప్రయాణికుల, సరుకు రవాణా ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు. గత 2025–26 ఆర్థిక సంవత్సరంలో, దక్షిణ రైల్వేలో మొత్తం 76.76 కోట్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించారు. దీని ద్వారా వచ్చిన ఆదాయం రూ. 8,269.09 కోట్లకు పెరిగిందని అధికారులు వెల్లడించారు. గత 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం రూ. 7,535.68 కోట్లుగా ఉండగా, ఇప్పుడు అది 9.7 శాతం పెరిగిందని తెలిపారు. రైల్వే బోర్డు నిర్దేశించిన రూ. 8,119.32 కోట్ల లక్ష్యం కంటే 1.8 శాతం అధికంగా ఆదాయం ఆర్జించి, ఒక రికార్డు సృష్టించడం గమనార్హం. దక్షిణ రైల్వే సరుకు రవాణా రంగంలోనూ గణనీయమైన వృద్ధిని సాధించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో, 42.113 మిలియన్ టన్నుల సరుకులను నిర్వహించడం జరిగింది. దీని ద్వారా రూ. 3,825.83 కోట్ల ఆదాయం సమకూరిందని . ఇది గత సంవత్సరంతో పోలిస్తే అదనపు వృద్ధి సాధించిందని తెలిపారు .అదేవిధంగా, పార్సెల్ సేవల ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరిగింది. గత ఏడాది 2024–25లో వచ్చిన ఆదాయం రూ. 168.04 కోట్లు కాగా, 2025–26 నాటికి అది రూ. 168.64 కోట్లకు పెరిగింది. ఇది కాకుండా, ప్రయాణ ఛార్జీలు కాకుండా ఆహారం, ఇతర సేవల వంటి ఇతర ఆదాయ వనరుల ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరిగిందని వెల్లడించారు.


