పెరంబూరులో
తిలక భామ
పీఎంకే అభ్యర్థుల
జాబితా విడుదల
సాక్షి, చైన్నె : పీఎంకే నేత అన్బుమణి సతీమణి సౌమ్య అన్బుమణి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయనున్నారు. ఆమెను ధర్మపురి నియోజకర్గం అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఈ మేరకు అన్బుమణి తన అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. పీఎంకే విషయంలో వ్యవస్థాపకుడు రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. పీఎంకే, చిహ్నం, మామిడి గుర్తు ను ఎన్నికల కమిషన్ నుంచి అన్బుమణి దక్కించుకున్నారు. దీంతో అన్నాడీఎంకే , బీజేపీ కూటమిలో అన్బుమణి పీఎంకే పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కూటమిలో అన్బుమణి పీఎంకేకు 18 స్థానాలను కేటాయించారు. ఈ స్థానాలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో తన సతీమని సౌమ్యకు సైతం అన్బుమణి పోటీ చేసే అవకాశం కల్పించారు.
ధర్మపురిలో సౌమ్య పోటీ
తలో పీఎంకే అనుబంధ స్వచ్చంద సంస్థ ద్వారా ధర్మపురి, కృష్ణగిరి, సేలం, తదితర జిల్లాలలో సేవా కార్యక్రమాల ద్వారా సౌమ్య అన్బుమణి సుపరిచితురాలే. అంతే కాదు, ఆమె తండ్రి కృష్ణస్వామి కాంగ్రెస్ సీనియర్ లీడర్ కాగా, సోదరుడు విష్ణు ప్రసాద్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. రాజకీయ కుటుంబానికి చెందిన సౌమ్య లోక్ సభ ఎన్నికలలో ధర్మపురి నుంచి పోటి చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా ఆమెను అసెంబ్లీ ఎన్నికల ద్వారా రాష్ట్ర రాజకీయాల్లోకి విస్తృతంగా తీసుకొచ్చేందుకు అన్బుమణి సిద్ధమయ్యారు. దీంతో ఆమెకు ధర్మపురి సీటు కేటాయించారు.అలాగే, టీవీకే అధ్యక్షుడు విజయ్ పోటీ చేస్తున్న పెరంబూరు నియోజకవర్గంలో పీఎంకే తరపున మహిళా నేత సత్యభామను పోటీలో పెట్టారు. డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ పోటీలో ఉన్న విరుదాచలంలో డాక్టర్ తమిళరసి ఆది మూలం, వీసీకే నేత తిరుమావళవన్ పోటీలో ఉన్న కాట్టుమన్నార్ కోవిల్‌లో డాక్టర్ అన్బు చోళన్‌ను నిలబెట్టారు. ఇక, సెంజిలో గణేష్‌కుమార్, అంబత్తూరులో కెఎన్ శేఖర్, కీల్ వేలూరులో వడి వేల్‌రావణన్, రిషివంధియంలో చెలియన్, ఉత్తర మేరూర్‌లో మహేశ్‌కుమార్, మైలాడుతురైలో ఏ పళణిస్వామి, షోళింగర్‌లో కె శరవణన్, విక్రవాండిలో సి శివకుమార్, సేలం ఉత్తరంలో ఎస్ సదాశివం, జయం కొండంలో కె వైది, తిరుప్పోరూర్‌లో న్యాయవాది కె బాలు, పోలూరులో సీఆర్ భాస్కరన్, పెన్నగరంలో పాడి వి సెల్వం,సేలం పశ్చిమంలో ఎం కార్తీలు పోటీ చేస్తారని జాబితాలో అన్బుమణి వివరించారు.


