సాక్షి, చైన్నె:దేశంలోనే అగ్రశ్రేణి విద్యాసంస్థగా వెలు గొందుతున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్, 2026–27 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు దర ఖాస్తులను ఆహ్వానిస్తూ సోమవారం ప్రకటన చేసింది. ఇందులో ఎం.టెక్, ఎం.ఎస్సీ, ఎం.ఏ ప్రోగ్రాముల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఏప్రిల్ 27, 2026 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.
కోర్సులు:డేటా సైన్స్–ఏఐ, ఎలక్ట్రిక్ వెహికల్స్, రోబోటిక్స్,సెమీకండక్టర్ టెక్నాలజీ వంటి అత్యాధునిక ఇంజనీరింగ్ విభాగాలతో పాటు ఇంగ్లీష్ స్టడీస్, ఎకనామిక్స్ వంటి హ్యుమానిటీస్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఎం.టెక్ విభాగంలో 735 సీట్లు, ఎం.ఏ విభాగంలో 100 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఎంపిక విధానం గురించి వివరిస్తూ, గేట్ స్కోర్ ఆధారంగా ఎం.టెక్, ఎం.ఏ ప్రవేశాలు ఉంటాయన్నారు. ఎంఎస్సీ కోసం జామ్ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరిగా స్పష్టంచేశారు. తరగతుల జూలై 27వ తేదీ ప్రారంభం అవుతుందని, అర్హత కలిగిన భారతీయ విద్యార్థులకు నెలకు రూ. 12,400 టీచింగ్ అసిస్టెంట్‌షిప్ లభిస్తుందన్నారు. వీటితో పాటూ డీఏఈ వంటి ప్రతిష్టాత్మక ఫెలోషిప్‌ల ద్వారా ఎంపికై న వారికి నెలకు రూ.35,000 స్టైపెండ్‌తో పాటు అణుశక్తి విభాగంలో ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తామన్నారు.
ఉద్యోగ అవకాశాలు
ఐఐటీ మద్రాస్‌లో పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు ఏటా టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్ లభిస్తాయని, పరిశ్రమలతో ఉన్న అనుసంధానం, అత్యాధునిక పరిశోధనా సౌకర్యాల వల్ల ఇక్కడి విద్యార్థులకు గ్లోబల్ స్థాయిలో మంచి గుర్తింపు ఉందని అకడమిక్ కోర్సుల డీన్ ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఈసందర్బంగా పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్‌ను సంప్రదించవచ్చని సూచించారు.


