ఓటు హక్కు వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు వినియోగించుకోవాలి

Mar 27 2026 8:56 AM | Updated on Mar 27 2026 8:56 AM

తిరుత్తణి: యువత వందశాతం ఓటింగ్‌లో పాల్గొనాలనే మేరకు కళాశాల విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. తిరుత్తణి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో గురువారం అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం ఓటింగ్‌ లక్ష్యంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఓటు విలువ, కొత్త ఓటర్లు కచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రలోభాలకు గురికాకుండా ఓటును స్వేచ్ఛగా వేసే అవకాశం కల్పించాలని ప్రతిజ్ఞ చేశారు. అలాగే ప్రతి ఓటరకు తమ వంతు అవగాహన కల్పించాలని సూచించారు. బీడీఓ కుమార్‌, సెల్వి, కళాశాల ప్రిన్సిపల్‌ దేవసేన. ఆధ్యాపకులు, బీడీఓ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

ఓటు హక్కుపై అవగాహన

వేలూరు: 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓ టు హక్కు కలిగి ఉండాలని కలెక్టర్‌ సుబ్బలక్ష్మి అన్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ 23న జరగనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వందశాతం పోలింగ్‌కు ప్రతిఒక్కరూ సహకరించాలని జిల్లా యంత్రాంగం పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా గురువారం ఉదయం వేలూరు జిల్లా ఆనకట్టు నియోజకవర్గంలోని విద్యార్థులచే అవగాహన ర్యాలీ ప్రారంభించి విద్యార్థులతో కలసి కరపత్రాలు చేత పట్టి అవగాహన కల్పించారు. కలెక్టర్‌ మా ట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియో గం చేసుకోవాలన్నారు. మీకు నచ్చిన రాజకీయ నా యకులకు మీ ఓటు అనే ఆయుధాన్ని వినియోగించి దేశ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత యువత చే తిలోనే ఉందన్నారు. కాట్పాడిలోని జూనియర్‌ రెడ్‌క్రా స్‌ ఆధ్వర్యంలో వంద శాతం పోలింగ్‌కు ప్రతి ఒక్క రూ సహకరించాలని కోరుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని సంఘం కార్యదర్శి జనార్దన్‌ ప్రా రంభించి కరపత్రాలు అందజేసి అవగాహన కల్పించారు. రెడ్‌క్రాస్‌ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement