ఆలోచన మంచిదయితే అంతా.. ! | - | Sakshi
Sakshi News home page

ఆలోచన మంచిదయితే అంతా.. !

Mar 20 2026 8:14 AM | Updated on Mar 20 2026 8:14 AM

తమిళ సినిమా: జెన్జీ స్టూడియోస్‌ ప్రతాపంపై ఇంతకుముందు తరుణం చిత్రాన్ని నిర్మించిన పుగళ్‌, ఈడెన్‌ కలిసి నిర్మించిన తాజా చిత్రం నీ ఫరెవర్‌. అశోక్‌ కుమార్‌ కలైవాణ దస్కతం వహించిన ఈ చిత్రం ద్వారా నాళైయ ఇయక్కునార్‌ సీజన్‌ 6 విన్నర్‌ సుదర్శన్‌ గోవింద్‌ , 2016 మిస్‌ సౌత్‌ ఇండియా గర్ల్‌ అర్చన రవి హీరో హీరోయిన్గా పరిచయం అయ్యారు. నటుడు వైజీ.మహేంద్రన్‌, నిళల్‌ గల్‌ రవి ,రతిక శ్రీనివాస్‌,సెల్లా, బ్రిందా ,డాక్టర్‌ విద్య, ప్రధోష్‌,స్నేహ శక్తి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. అశ్విన్‌ హేమంత్‌ సంగీతాన్ని రాజా భట్టాచార్జీ ఛాయాగ్రహణంను అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని ఈనెల 27వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చిత్రఆడియో, ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో నిర్మాత ధనుంజయన్‌, రాజా తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. చిత్ర నిర్మాత పుగళ్‌ మాట్లాడుతూ ఎప్పుడు నమ్మేది ఒక్క విషయాన్నేననీ, మన ఆలోచనలు మంచివైతే అంత మంచే జరుగుతుందని, అందుకు ఉదాహరణ ఈ చిత్రం అని పేర్కొన్నారు ఇంతకుముందు తరుణం అనే చిత్రాన్ని నిర్మించాలని ఆ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మానని, అయితే అది ఆశించిన నిజాన్ని సాధించకపోవడంతో ఈ చిత్ర నిర్మాణం ఆలస్యం అయిందని చెప్పారు. అయితే ఈ చిత్రానికి దర్శకుడు అశోక్‌ ప్రయత్నం, యూనిట్‌ సభ్యుల శ్రమతో రూపొందిందన్నారు. తమకు చాలా సవాళ్లు ఎదురయ్యాయని వాటిని అధికమించి మంచి చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. మహేంద్ర చాలా సపోర్ట్‌ చేశారని, సంగీత దర్శకుడిని చాలా కష్టపెట్టినట్లు వెల్లడించారు. పాటలు ఇప్పటికే మంచి విజయాన్ని సాధించాయని నిర్మాత పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement