క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Mar 17 2026 7:51 AM | Updated on Mar 17 2026 7:51 AM

● నియామక ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్‌ ● కొత్త సర్వే గందరగోళం ● మారుతున్న సమీకరణలు

నాకూ ఒక ఇల్లు ఉంది

తమిళసినిమా: ప్రముఖ వాణిజ్య సంస్థ జాయఅలుకాస్‌ అధినేత జాయ్‌ ప్రపంచ వ్యాప్తంగా తన వ్యాపారాలను విస్తరించిన విషయం తెలిసిందే. కాగా ఈయన పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పేదలకు విద్య, వైద్య సహాయ సహకారాలను అందిస్తున్నారు. తాజా గా జాయ్‌ హోమ్స్‌ పేరుతో పలు రాష్ట్రాల్లో పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మిస్తున్నారు. అందులో భాగంగా తమిళనాడులోని పలు జిల్లాలకు చెందిన ఇళ్లు లేని నిరుపేదలను ఎంపిక చేసి ఉచితంగా గృహాలను అందించారు. సోమ వారం చైన్నెలో జరిగిన ఓ కార్యక్రమంలో 50 ఇళ్లను అందించారు. కార్యక్రమంలో నటుడు ప్రశాంత్‌, దర్శక, నటుడు, నిర్మాత త్యాగరాజన్‌, నిర్మాతల మండలి కార్యదర్శి కదిరేశన్‌, నటి దేవయాని తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నటుడు ప్రశాంత్‌ మాట్లాడుతూ తనకు ఒక సొంత ఇల్లు ఉందన్న గంభీరంగా చెప్పుకునే విధంగా పేదలకు జాయ్‌ హోమ్స్‌ సంస్థ బృహత్తర కార్యాన్ని నిర్వహిచడాన్ని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.

చైన్నెకి 36 మంది

ఇన్‌స్పెక్టర్ల బదిలీ

అన్నానగర్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడిన స్థితిలో ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న 36 మంది పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లను చైన్నెకి బదిలీ చేశారు. పోలీస్‌ కమిషనర్‌ అరుణ్‌ ఆదివారం 36 మంది పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లకు నియామకాలు కల్పిస్తూ ఒక ఉత్తర్వు జారీ చేశారు. బదిలీ అయిన పురు ష ఇన్‌స్పెక్టర్లలో ఎక్కువ మందిని పోలీస్‌ స్టేష న్ల క్రైమ్‌ బ్రాంచ్‌లో నియమించారు. ఆల్‌ మహి ళా పోలీస్‌ స్టేషన్లలో మహిళా ఇన్‌స్పెక్టర్లకు అవకాశాలు కల్పించారు. చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల నుండి కూడా ఇన్‌స్పెక్టర్లను చైన్నెకి బదిలీ చేయడం గమనార్హం. ఆవడి కమిషనరేట్‌ నుండి కొంతమంది ఇన్‌స్పెక్టర్లను చైన్నెకి బదిలీ చేశారు.

హంగ్‌ ఊహాగానాలు

సాక్షి, చైన్నె: రాష్ట్ర రాజకీయ సమీకరణలు మారుతున్నాయన్న చర్చ ఊపందుకుంది. రాష్ట్రంలో హంగ్‌ ఏర్పడేనా లేదా కూటమి పాలన తప్పదా అన్న చర్చ జోరందుకుంది. ఇందుకు అనుగుణంగా తాజాగా ఓ సర్వే ఫలి తాలు వెలుగులోకి వచ్చాయి. గత కొన్ని నెలలుగా అనేక సర్వేలు తమిళనాట వెలుగు చూస్తున్నాయి. ఇందులో సీఎం స్టాలిన్‌కే మళ్లీ అధికారం అన్నది స్పష్టమైంది. అదే సమయంలో ఆదివారం వెలువడ్డ ఓ సర్వేలో సీఎం అభ్యర్థి రేసులో స్టాలిన్‌, టీవీకే అధినేత విజయ్‌ మధ్య గట్టి పోటీ నెలకొననున్నట్టు ప్రకటించారు. డీఎంకేకు ఓటు బ్యాంక్‌ తగ్గే అవకాశాలు ఉన్న ట్టు ప్రకటించారు. ఈ పరిస్థితులలో సోమవా రం మ్యాట్రజై, ఐనాస్‌ సంస్థలు జరిపిన సర్వే లో హంగ్‌ తప్పదా లేదా తమిళనాడు చరిత్రలో ప్రప్రథమంగా సంకీర్ణ పాలనా అన్న చర్చ ఊపందుకుంది. ఈ సర్వే ప్రకారం డీఎంకే కూటమికి 104 నుంచి 114 సీట్లు, అన్నాడీఎంకే కూటమికి 114 నుంచి 127 సీట్లు వస్తాయని తేల్చారు. విజయ్‌ టీవీకేకు 6 నుంచి 12 స్థానా లు, ఇతరులకు మరో ఆరు స్థానాలు వస్తాయని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు తప్పనిసరి. అయితే తాజా సర్వే మేరకు సంపూర్ణ మెజారిటీ అన్నది దక్కేనా అన్నది సందిగ్ధంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో విజయ్‌ కీలక పాత్ర పోషిస్తారని తాజా సర్వే తేల్చడం గమనార్హం. ఓటింగ్‌శాతం విజయంలో అన్నాడీఎం కూటమికి 39 నుంచి 40 శాతం, డీఎంకే కూటమికి 37 నుంచి 38 శాతం, విజయ్‌ టీవీకేకు 14 నుంచి 15 శాతం, ఇతరులకు 10 నుంచి 12 శాతం వస్తాయని తాజా సర్వేలో తేలింది.

జాతీయ ప్రజాస్వామ్య కూటమి పార్టీలు

తిరువొత్తియూరు: జాతీయ ప్రజాస్వామ్య కూటమి పార్టీల తరఫున రెవెన్యూ జిల్లాల రాజధానుల్లో నేడు నిరసన ప్రదర్శన జరుగుతుందని ఎడప్పాడి పళనిస్వామి చెప్పారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విధంగా తెలిపారు. డీఎంకే ప్రభుత్వాన్ని శాంతి భద్రతల కోసం ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తూ జాతీయ జననాయక కూటమి పార్టీలు కలిసి, మంగళవారం(17వ తేదీ) రెవెన్యూ జిల్లాల రాజధానుల్లో జరగనున్న నిరసన ప్రదర్శనల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన నాయకత్వంలో తీసుకొచ్చిన ప్రభుత్వం ప్రజల సంక్షేమ పథకాలు అన్నీ నిలిపివేయబడ్డాయి. అన్నాడీఎంకే అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి పార్టీల తరఫున పెద్ద ఎత్తున ప్రజలతో ఈ నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రదర్శనకు అన్నా డీఎంకే నిర్వాహకులు, కార్యకర్తలు, కూటమి పార్టీల నిర్వాహకులు, ఇతర కార్యకర్తలు, ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చి మద్దతు ఇవ్వాలని కోరుతున్నానని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement