ఆరోసారి తిరుచ్చి శివ ఎంపిక మూడోసారి అన్బుమణి, రెండోసారి తంబి ఎన్నిక తొలిసారిగా సభకు సుదీష్, రవీంద్రన్, క్రిష్టోఫర్ తిలక్
సాక్షి, చైన్నె: తమిళనాడు నుంచి ఆరుగురు అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం సాయంత్రంతో ముగియడంతో రిటర్నింగ్ అధికారి ఆర్.శాంతి ఏక్రగీవంగా ఎంపికై న వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. వివరాలు.. రాష్ట్రానికి చెందిన డీఎంకే – తిరుచ్చి శివ, అందియూరు సెల్వరాజ్, కనిమొళి సోము, ఎన్ ఆర్ ఇలంగో, అన్నాడీఎంకే తరపున తంబిదురై, తమిళ మానిల కాంగ్రెస్‌కు చెందిన జీకే వాసన్ పదవీ కాలం ముగియనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ పదవుల భర్తీ నిమిత్తం నామినేషన్ల ప్రక్రియ గత నెలాఖరు నుంచి జరిగింది. నామినేషన్ల గడువు చివరి రోజున డీఎంకేకు చెందిన ఇద్దరు, ఈకూటమిలోని కాంగ్రెస్, డీఎండీకే తరపున తలా ఒక్కరు. అన్నాడీఎంకే నుంచి ఒకరు, ఈ కూటమి లోని పీఎంకే నుంచి ఒకరునామినేషన్ దాఖలు చేశారు.
ఏక్రగీవ ఎంపిక..
మొత్తం 14 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ఆరుగురు ప్రధాన అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే పరిశీలనలో పరిగణనలోకి తీసుకున్నారు. మిగిలిన స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. పీఎంకే తరపున దాఖలు చేసిన అన్బుమణి తరపున ఆయన సతీమణి సౌమ్య అన్బుమణి (ప్రత్యామ్నాయ అభ్యర్థిగా వేసిన నామినేషన్)ను చివరి రోజైన సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో ఆరుగురు ఏకగ్రీవంగా ఎంపికై నట్టు రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్. శాంతి ప్రకటించారు. ఎన్నికై న వారిలో అధికార డీఎంకే కూటమిలో నలుగురు, ప్రతి పక్ష అన్నాడీఎంకే కూటమిలో ఇద్దరు ఉన్నారు. ఇందులో డీఎంకే కూటమిలో డీఎండీకే తరపున ఎల్‌కే సుదీష్ ప్రపథమంగా రాజ్య సభలో అడుగు పెట్టనున్నారు. దివంగత నేత విజయకాంత్ స్థాపించిన డీఎండీకే నుంచి తొలి ప్రతినిధిగా రాజ్య సభలో అడుగు పెట్టనున్నడం విశేషం. ఇక అన్నాడీఎంకే తరపున తంబి దురై మరో మారు మళ్లీ సభలో అడుగు పెట్టనున్నారు. పీఎంకే తరపున అన్బుమణి మూడోసారి రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇక, డీఎంకే తరపున తిరుచ్చి శివ వరుసగా ఆరో సారి అడుగు పెట్టేందుకు రెడీ అయ్యారు. ఇక, డీఎంకే తరపున కాన్ స్టంట్ రవీంద్రన్, ఈకూటమిలోని కాంగ్రెస్‌కు చెందిన క్రిష్టోఫర్ తిలక్ ప్రపథమంగా రాజ్యసభకు ఎంపికయ్యారు. ఏక్రగీవంగా ఎన్నికై న ఈ ఆరుగురు ఏప్రిల్ 3వ తేదీ రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరి పదవీ కాలం 2032 వరుకు ఉంటుంది.
ఎల్‌కే సుదీష్, క్రిష్టోఫర్ తిలక్,రవీంద్రన్


