మరోసారి విజయ్‌కు సీబీఐ సమన్లు | - | Sakshi
Sakshi News home page

మరోసారి విజయ్‌కు సీబీఐ సమన్లు

Mar 10 2026 7:34 AM | Updated on Mar 10 2026 7:34 AM

● టీవీకే వర్గాలలో కలవరం ● నేడు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు ● పది రోజులు గడువుకోరిన విజయ్‌

సాక్షి, చైన్నె: టీవీకే అధినేత విజయ్‌ను మళ్లీ విచారించేందుకు సీబీఐ నిర్ణయించడం చర్చకు దారి తీసింది. మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ సో మవారం సమన్లు జారీ కావడం గమనార్హం. అయితే, పది రోజులు గడువుకోరుతూ విజయ్‌ తరపున సీబీఐకు విన్నవించినట్టు సంకేతాలు వెలువడ్డాయి.

కేసు నేపథ్యం ఇదీ..

గత ఏడాది సెప్టెంబర్‌ 27న కరూర్‌లో విజయ్‌ నేతృత్వంలో జరిగిన టీవీకే మీట్‌ ది పీపుల్‌ కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో 41 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ వి చారణ చేపట్టింది. ఈ కేసులో జనవరి 12న విజయ్‌ను ఏడు గంటల పాటుగా సీబీఐ విచారించింది. ఆతర్వా త 19వ తేదీన రెండవ సారిగా ఆరు గంటల పాటు వి చారణ కొనసాగింది. ఈ సమయంలో విజయ్‌ పేరు ను ఛార్జ్‌షీట్‌లో చేర్చినట్టు, ఆయన అరెస్టయ్యే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. అయితే, విచారణ ముగించుకుని ఆయన చైన్నెకు వచ్చేశారు.

మళ్లీ సమన్లు..

అసెంబ్లీ ఎన్నికల పనులపై విజయ్‌ తీవ్రంగా దృష్టి పెట్టి ఉన్నారు. పార్టీ తరపున కార్యమ్రాలను విస్తృతం చేశారు. ప్రచార సభలను వేగవంతం చేసే విధంగాదూకుడు పెంచారు. అదే సమయంలో అభ్యర్థుల ఎంపిక కసరత్తుల నిమిత్తం మంగళవారం ఉంచి ఆశావహుల వద్ద ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో విచారణలో భాగంగా మరికొన్ని కీలక వివరాలు సేకరించిన సీబీఐ, వాటిపై స్పష్టత కోసం మరో మారు విజయ్‌ను విచారించేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడటం టీవీకే వర్గాలలో కలవరాన్ని రేపింది. విజయ్‌కు మరో మారు సమన్లు జారీ అయ్యాయి. మంగళవారం జరిగే విచారణకు సోమవారం సమన్లు జారీ కావడం చర్చకు దారి తీసింది. జననాగయన్‌ చిత్రానికి మళ్లీ సెన్సార్‌ ప్రక్రియ సోమవారం జరగాల్సిననేపథ్యంలో ఓ సభ్యుడికి అనారోగ్య కారణంగా వాయిదా పడ్డట్టు ప్రచారం సాగింది. అయితే విషయం వెలువడ్డ కాసేపటికి విజయ్‌కు సమన్లు అని వచ్చిన సమాచారంతో ఈ సారి ఆయన్ని అరెస్టు చేస్తారా..? అన్న చర్చ ఊపందుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటం, విజయ్‌ తన పార్టీని ఒంటరిగా బరిలోకి దించి కార్యక్రమాలు వేగవంతం చేసిన సమయంలో ఈ సమన్లు ఏమిటో? అన్నట్టుగా రాజకీయ కోణంలోనూ చర్చజోరందుకుంది. అదే సమయంలో విజయ్‌ తాను పలు కార్యక్రమాల నిమిత్తం ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు, ఈ దృష్ట్యా, పది రోజులు గడువు ఇవ్వాలని తన న్యాయవాదుల ద్వారా సీబీఐకు సమాచారం పంపినట్టు సంకేతాలు వెలువడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement