సాక్షి, చైన్నె: తమిళనాడు ఇన్‌చార్జ్ గవర్నర్‌గా కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లెకర్ ఈనెల 12న చైన్నెలో బాధ్యతలు స్వీకరించనున్నారు. వివరాలు.. 2021లో డీఎంకే ప్రభుత్వం ఏర్పడినానంతరం రాష్ట్ర గవర్నర్‌గా ఆర్‌ఎన్ రవి బాధ్యతలు స్వీకరించారు. ఆది నుంచి డీఎంకే ప్రభుత్వం– గవర్నర్ మధ్య వివాదాలు సాగుతూ వచ్చాయి. సుమారు నాలుగున్నర సంవత్సరాల పాటుగా రాష్ట్రగవర్నర్‌గా డీఎంకేకు పక్కలో బల్లెంగా ఉన్న ఆర్‌ఎన్ రవి తాజాగా బదిలీ అయ్యారు. ఆయన్ని పశ్చిమ బెంగాల్‌కు బదిలీచేశారు. ఈ బాధ్యతలను కేరళ గవర్నర్‌గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లెకర్ అదనంగా అప్పగించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో గవర్నర్‌గా ఎవర్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియమిస్తుందో అన్న చర్చ జరుగుతోన్న నేపథ్యంలో ఇన్‌చార్జ్ గవర్నర్ బాధ్యతలు స్వీకరించేందుకు సన్నద్ధమయ్యారు. పాత గవర్నర్‌రవి బుధవారం చైన్నె నుంచి కోల్‌కతాకు బయలు దేరనున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. అదే రోజున ఇన్‌చార్జ్ గవర్నర్ ఇక్కడకు రానున్నారు. 12వ తేదీన ప్రమాణ స్వీకారంచేయనున్నారు. ఆయనతో మద్రాసు హైకోర్టు కొత్త న్యాయమూర్తిగా గత వారం నియమితులైన జస్టిస్ శుష్రత్ అరవింద్ ధర్మాధికారి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.


