అవినీతి పాలన నుంచి విముక్తే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అవినీతి పాలన నుంచి విముక్తే లక్ష్యం

Mar 10 2026 7:34 AM | Updated on Mar 10 2026 7:34 AM

కొరుక్కుపేట: డీఎంకే అవినీతి పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే లక్ష్యమని తమిళనాడు, కర్ణాటక బీజేపీ జాతీయ కో–ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయలన పుదుక్కోట్టైలోని అలంగుడి రోడ్‌లోని అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితి , ఎన్డీఏ కూటమి భవిష్యత్తు కార్యాచరణ గురించి పార్టీ నాయకులు, కేడర్‌తో చర్చలు జరిపారు. మాజీ మంత్రి డాక్టర్‌ సి.విజయభాస్కర్‌, జిల్లా అధ్యక్షుడు రామచంద్రన్‌, బాల గణపతి, స్థానిక సంస్థల అభివృద్ధి సెల్‌ రాష్ట్ర కార్యదర్శి శివ మురుగేశ్వర్‌, ప్రొటోకాల్‌ కార్యదర్శి ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement