సాక్షి, చైన్నె: కుటుంబ పెద్దలకు రూ. 5 వేలు ఆర్థిక సాయాన్ని ముందుగానే చెల్లించడానికి కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ప్రభుత్వం నిర్ణయించింది. పుదుచ్చేరి శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీలో ప్రకటించిన ప్రణాళికలను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ప్రధానంగా దారిద్య్రరేఖకు దిగువన నివసించే గ్రీన్ కుటుంబకార్డు కలిగిన కుటుంబ పెద్దకు అందిస్తున్న సహాయం మొత్తాన్ని రూ. 2000 నుంచి రూ. 2500కు పెంచారు. ఈ సబ్సిడీ గత నెల నుండి అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. పసుపు కార్డులు కలిగి ఉన్న, ఎటువంటి సబ్సిడీ పొందని గృహ యజమానులకు ప్రభుత్వం రూ.1000 అందించనున్నట్లు ప్రకటించింది. అలాగే తమిళనాడు తరహాలో మహిళలకు ప్రత్యేక ఆర్థిక సాయానికి సిద్దమయ్యారు. 3000 మంది మహిళలకు ఈసాయం అందించనున్నారు. సీఎం రంగస్వామి ఆదేశాలతో 2 నెలలకు రూ. 3000 అందించడానికి పంపించిన నివేదికను గవర్నర్ కై లాస్ నాథన్ ఆమోదించారు. ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత ప్రభుత్వం ఉచిత పథకాలను అడ్డుకునే అవకాశం ఉన్నందున, రెండు నెలలకు గాను కుటుంబ పెద్దలకు రూ.5,000 చొప్పున వెంటనే ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు సైతం గవర్నర్ ఆమోదించడంతో ఫిబ్రవరి, మార్చి రెండు నెలలకు రూ.5000 పంపిణీకి చర్యలు గ్రీన్ సిగ్నల్ లభించింది. రెడ్‌కార్డ్ (దారిద్య్రరేఖకు దిగువన ఉన్న) కుటుంబాలుకు నెలవారీ ఇచ్చే రూ. 2,500 సహాయాన్ని ఫిబ్రవరి , మార్చి నెలలకు కలిపి ఒకేసారి రూ. 5,000 బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. ఇక పసుపు కార్డుదారులైన ఎటువంటి సబ్సిడీ పొందని కుటుంబ పెద్దలకు రూ. 1,000 అందించనున్నారు. అలాగే తుంబా తెగ మహిళలకు కానుకగా రూ. 5,000 వేలు అందించేందుకు సిద్ధమయ్యారు.


