ఓఎంఆర్‌లో సీనియర్ కేర్ హోమ్
సాక్షి, చైన్నె: ఇంటిగ్రేటెడ్ సీనియర్ కేర్ ఎకోసిస్టమ్ చైన్నెలో సీనియర్ కేర్ హోమ్‌ను ఏర్పాటు చేసింది. 72 పడకల సౌకర్యం ఓల్డ్ మహాబలిపురం రోడ్ (ఓఎంఆర్) కారిడార్ దీనిని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలోని సీనియర్లకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక సహాయక సేవలను పొందే అవకాశాన్ని కల్పించారు. ఈ విషయంగా అన్టరాఅసిస్టెట్ కేర్ సర్వీసు సీఈఓ ఇషాన్ ఖన్నా మాట్లాడుతూ, తమిళనాడు జనాభాలో దాదాపు14 శాతం మంది తాజాగా 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గలవార ఉన్నారని వివరించారు. కేరళ తర్వాత దేశంలో రెండవ అత్యధికంగా వృద్ధుల సంఖ్య ఉన్నట్టు పేర్కొన్నారు. పట్టణ కేంద్రాలలో, ప్రతి ఏడుగురు నివాసితులలో ఒకరు సీనియర్ సిటిజన్ అని తెలిపారు. వీరిలో చాలామంది ఒంటరిగా లేదా వారి జీవిత భాగస్వామితో మాత్రమే నివసిస్తున్నారని, వీరికి వృద్ధాప్యంలో స్నేహ పూర్వక సంరక్షణ అవశ్యం గురించి తాము విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీరిలో సామాజిక, భావోద్వేగ, ఆరోగ్య, దీర్ఘ కాలిక సంరక్షణ లక్ష్యంగా కేర్ హోమ్‌లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.


