రెండో పెళ్లికి రెడీ
నటి మమత
మోహన్‌దాస్
తమిళసినిమా: ప్రేమలో మోసపోయిన సినీ తారల్లో నటి మమతమోహన్‌దాస్ ఒకరు. ఈమె బహు భాషా నాయకి. మలయాళం, తమిళం,తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో కథానాయకిగా నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించారు. ముఖ్యంగా తమిళంలో శివప్పధికారం, గురు ఎన్ ఆళు, తడయార తాక్క,ఎనిమి,మహారాజా తదితర చిత్రాల్లో నటించారు. తెలుగులోనూ జూనియర్ ఎన్‌టీఆర్‌కు జంటగా యమదొంగ వంటి చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. ప్రస్తుతం తమిళంలో ప్రభు జయరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న మైడియర్ సిస్టర్ చిత్రంలో అరుళ్‌నిధితో కలసి నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా ఆ మధ్య క్యాన్సర్ మహ్మమారి బారిన పడ్డారు. అయితే దాని నుంచి పోరాడి భయటబడడం విశేషం. తర్వాత మళ్లీ నటించడం మొదలెట్టిన మమత మోహన్‌దాస్ తన ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలను ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. అందులో క్యాన్సర్ వ్యాధి నుంచి బయప పడి మళ్లీ నటిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఇప్పుడు తనకు మళ్లీ ప్రేమపై దృష్టి మళ్లిందన్నారు. అలా ఒక ప్రముఖ నటుడితో డేటింగ్‌కు వెళ్లినని చెప్పారు. అయితే అతను మరో యువతితో నిశ్చితార్థం జరిగిందన్న విషయం తనకు ఆ తరువాతనే తెలిసిందన్నారు. దాంతో తన మనసు ముక్కలైయ్యిందన్నారు. ఒక అమ్మయి నమ్మకాన్ని బద్ధలు కొట్టడానికి వారికి మనసు ఎలా వస్తుందో అని ఆవేదన చెందానన్నారు. దీని గురించి ఆ నటుడిని అడగ్గా చాలా లైట్‌గా తీసుకున్నాడని చెప్పారు. అయితే తాను మాత్రం ఆ ఘటనను జీర్ణించుకోలేకపోయానన్నారు. తన మాజీ భర్త కూడా ఒక కార్యక్రమంలో తనను చూసి వివాహం చేసుకుందామనే ఆకాంక్షను వ్యక్తం చేశారని, అందుకు తాను తన తల్లిదండ్రులను అడగమని చెప్పానన్నారు. అలా అప్పుడు తమ పెళ్లి జరిగిందని చెప్పారు. కాగా వివాహ బంధంపై తనకు నమ్మకం ఉందని, అది ఎప్పటికీ చెరగదని అన్నారు. ప్రస్తుతం మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన మాదిరిగానే అర్థం చేసుకోగలిగిన వ్యక్తి తారసపడితే కొత్త జీవితంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నట్లు నటి మమత మోహన్‌దాస్ పేర్కొన్నారు.


