నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, చైన్నె: రాష్ట్ర అసెంబ్లీ చివరి సమావేశం మంగళ వారం ప్రారంభం కానుంది. ఇందులో ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు 2026–27 సంవత్సరానికి గాను మ ధ్యంతర(తాత్కాలిక) బడ్జెట్‌ను దాఖలు చేయనున్నా రు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాజా బడ్జెట్‌పై ఎ దురు చూపులు పెరిగాయి. వివరాలు.. ఎంకే ప్రభు త్వం ఏర్పాటై మరో రెండు నెలలో ఐదేళ్లు ముగియ నుంది. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఇప్పటికే మొ దైలంది. పొత్తు కసరత్తులు, సీట్ల పందేరాలు అంటూ ఆయా కూటములు ముందుకెళ్తున్నాయి. ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టడంలో అధికార పక్షం ఒక అ డుగు ముందంజలోనే ఉంది. ఐదేళ్ల కాలంలో తాము అ మలు చేసిన బృహత్తర పథకాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో సీఎం స్టాలిన్ ప్రభుత్వం దూకుడు పెంచింది. అదే సమయంలో తమ పథకాల కు నగారా మోగగానే బ్రేక్ వేస్తారన్న సంకేతాలతో ము ందస్తుగా మార్చి, ఏప్రిల్ నెలలకు గాను నగదు పథకాలను విస్తృతంగా అమలు చేసే దిశగా స్టాలిన్ కార్యాచరణలో ఉన్నారు. ఇప్పటికే మగలిర్ ఉరిమై తిట్టం లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చారు. అలాగే, పుదుమై పెన్, తమిళ్ పుదుల్వన్ పథకం లబ్ధిదారులైన విద్యార్థులకు సైతం నిధుల విడుదల కసరత్తులు జరుగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిణామాలు ఓ వైపు ఉంటే, మరోవైపు మార్చి మొదటి వారంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగేందుకు అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే సమాచారాలు వెలువడ్డాయి. దీంతో అసెంబ్లీలో మధ్యంతర బడ్జెట్‌ను దాఖలు చేయడానికి సీఎం స్టాలిన్ సిద్ధమయ్యారు.
సభాపర్వం..
మంగళవారం అసెంబ్లీ సమావేశం కానుంది. ఇదే డీఎంకే ప్రభుత్వానికి తాజా పాలనలో చివరి సమావేశంగా పరిగణించక తప్పదు. ఇందులో ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు బడ్జెట్‌ను సమర్పించనున్నారు. మధ్యంతర బడ్జెట్‌లో ఏదేని వరాలు కురిపించేనా లేదా అమలులో ఉన్న వివిధ పథకాలకు నిధుల కేటాయింపుతో మమా అని పించేనా అన్నది వేచి చూడాల్సిందే. మధ్యంతర బడ్జెట్ ద్వారా కాకుండా, తమ ఎన్నికల మ్యానిఫెస్టో ద్వారా బృహత్తర పథకాలను మరింతగా ప్రకటించేందుకు ద్రావిడ మోడల్ డీఎంకే కసరత్తు చేస్తుండడం గమనార్హం. ఉదయం 9.30 గంటలకు సభ ప్రారంభం కానున్నది. ఇందులో ఆర్థిమంత్రి తంగం తెన్నరసు 2026–27 సంవత్సరానికి గాను తాత్కాలిక బడ్జెట్ పద్దును సమర్పించనున్నారు. అనంతరం అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. 20 వరకు సభను నిర్వహించే లా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ హాల్‌లో ఏర్పాట్లను మంత్రులు ఏవీ వేలు, కోవి చెలియన్ పరిశీలించారు. పేపర్ రహితంగా బడ్జెట్ దాఖలు చేస్తున్న దృష్ట్యా, ట్యాబ్ తరహా స్క్రీన్ల పనితీరును, స్పీకర్ల పనితీరును పరిశీలించారు.


