దక్షిణాదిలో రూ. 4 వేల కోట్ల పెట్టుబడి
– రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం
సాక్షి,చైన్నె: దక్షిణ భారత దేశంలో రూ. 4 వేల కోట్ల పెట్టుబడి దిశగా జియో హాట్ స్టార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా తమిళనాడులో బలోపేతం దిశగా ప్రోత్సాహక ఒప్పందం ప్రభుత్వంతో జరిగింది. చైన్నెలో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగంది. స్టార్ స్టడెడ్ ఈవెంట్, మీడియా, వినోద పరిశ్రమ, జియో హాట్ స్టార్ రానున్న 5 సంవత్సరాలలో ఈ 4 వేల కోట్లను దక్షిణాదిన పెట్టనుంది. డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, నటుడు, ఎంపీ కమలహాసన్, సమాచార మంత్రి స్వామినాథన్, జియో స్టార్ అధిపతి, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుశాంత్ శ్రీరామ్, కృష్ణన్ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందాల గురించి జియో స్టార్ ఎంటర్ టైన్ మెంట్ (సౌత్) హెడ్ కుట్టి వివరించారు. కంటెంట్‌పరిణామం, దక్షిణ భారత కథలను ఉన్నతీకరించేందుకు, విస్తరించేందుకు ఇది వేదికగా ప్రకటించారు. తమిళనాడు ప్రభుత్వంతో లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకం చేసుకున్నట్టు ప్రకటించారు. తమిళనాడు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇది కీలకంగా మారుతుందన్నారు. ప్రాంతీయ, తొలి ఫార్మాట్లు, కొత్త యుగ కథలు, కథకులు, తమ రచనలను భౌగోళిక సరిహద్దులకు మించి విస్తరించే విధంగా ముందుకు సాగనున్నామన్నారు. డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ మాట్లాడుతూ, జియో హాట్‌స్టార్‌తో భాగస్వామ్యం ఆనందమేనని పేర్కొంటూ, చైన్నె సంప్రదాయం, కళ, సంస్కృతి గురించి వివరిస్తూ, తెలుగు, మలయాళం సినిమాలు సైతం ఇక్కడ నిర్మించబడ్డాయని, నిర్మిస్తూనే ఉన్నారని వివరించారు. కళ జీవితంలో ఒక శక్తివంతమైనదని పేర్కొంటూ, దివంగత నేతలు అన్నా, కరుణానిధిల సీని రంగంలోకీలక పాత్రలను గుర్తు చేశారు. ఈ ఒప్పందం మేరకు 1000 మందికి ప్రత్యక్షంగా, 15 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు సృష్టించనున్నామన్నారు. కార్యక్రమానికి సినీ నటులు మోహన్ లాల్, నాగార్జున, విజయ్ సేతుపతి, సుదీప్, సాయికుమార్, తారలు ప్రియ మణి , ఐశ్వర్య రాజేష్ పాల్గొన్నారు. కాగా జియో హాట్‌స్టార్ వెబ్ సీరీస్‌ల గురించి పరిచయం చేశారు.


