విద్యుత్‌షాక్‌తో కార్మికుడి మృతి
తిరువళ్లూరు: వరిపొట్టును లోడింగ్ చేస్తున్న సమయంలో కన్వేయర్ బెల్టు వద్ద విద్యుత్‌షాక్‌కు గురై ఓ కార్మికుడు అక్కడిక్కడే మృతి చెందాడు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా వెంగల్ చిత్తంబాక్కంలో గ్రామంలో గోవిందస్వామికి చెందిన శఽరవణ నూతన రైస్‌మిల్ ఉంది. ఈక్రమంలో తిరువళ్లూరు, సెంగుడ్రం, పాండియనల్లూరు తదితర రైస్‌మిల్ నుంచి వరి పొట్టును సేకరించి వాటిని పశుధాణాలకు ఉపయోగించే వ్యాపారాన్ని సురేంద్రరెడ్డి అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఇందులో భాగంగానే పాడియనల్లూరు గ్రామానికి చెందిన సతీష్‌తో సహా సుమారు 10 మంది కార్మికులు వరి పొట్టును మిషన్ ద్వారా లోడింగ్ చేసే పనులను చేస్తున్న సమయంలో కన్వేయర్ బెల్టులో నుంచి విద్యుత్ సర్క్యూట్ కావడంతో షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకుని ఘటన స్థలానికి వచ్చిన వెంగల్ పోలీసులు, మృతదేహాన్ని కై వసం చేసుకుని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.


