స్టార్టప్ హబ్‌గా ఐఐటీ మద్రాసు ఇంక్యుబేషన్ సెల్
– 500 స్టార్టప్ మైలురాయిని దాటి గుర్తింపు
కొరుక్కుపేట: దేశంలో అతిపెద్ద డీప్ –టెక్ స్టార్టప్ హబ్‌గా అవతరిస్తున్న ఐఐటీమద్రాసు ఇంక్యుబేషన్ సెల్ 500 స్టార్టప్ మైలురాయిని దాటింది. ఈ మేరకు జరిగిన కార్యక్రమంలో ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి మాట్లాడారు. స్టార్టప్ నిర్మాణం, స్థాయిని వేగవంతం చేయడానికి ఐఐటీ మద్రాసు నోడల్ ఏజెన్సీ ,ఐఐటి మద్రాసు ఇంక్యుబేషన్ సెల్ (ఐఐటీఎంఐసీ) 12 ఏళ్ల క్రితం ప్రారంభమైందన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 500కి పైగా డీప్ –టెక్ స్టార్టప్‌లను ఇంక్యుబేట్ చేయడం నిజంగా గొప్ప విషయం అన్నారు. ప్రధానమంత్రి ఊహించిన విధంగా వికసిత్ భారత్ 2047 నాటికి పరిణతి చెందిన స్టార్టప్‌గా దేశం నిలుస్తుందన్నారు. ఐఐటీ మద్రాసు ఇంక్యుబేషన్ సెల్ ఆ ధృఢమైన ప్రగతి శీల అడుగు వేసిందని గట్టి నమ్ముతున్నామని తెలిపారు. ఐఐటీఎం ఐసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న తమస్వతి ఘోష్ మాట్లాడుతూ ఐఐటీఎంఐసీ ప్రస్తుతం సంవత్సరానికి 100కి పైగా కొత్త స్టార్టప్‌లను ఇంక్యుబేట్ చేస్తుందని తెలిపారు.
ఢిల్లీకి పన్నీరు
– అమిత్ షాతో భేటీ?
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీరు సెల్వం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. ఎన్నికల కమిషన్‌ను సంప్రదించేందుకు వెళ్లినట్టుగా ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ నిమిత్తం వెళ్లినట్టు చర్చ జరుగుతోంది. అన్నాడీఎంకే నుంచి బహిష్కరించ బడ్డ పన్నీరు సెల్వం ఈనెల 15వ తేదీ వరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి గడువు ఇచ్చారు. అంతలోపు నిర్ణయం తీసుకోని పక్షంలో తదుపరి అడుగుల దిశగా ఆయన ముందుకెళ్తున్నారు. ఈ పరిస్థితులలో పన్నీరు సెల్వం ఢిల్లీ వెళ్లడం చర్చకు దారి తీసింది. ఆయన అన్నాడీఎంకే వ్యవహారాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసేందుకు వెళ్లినట్టుగా మద్దతు దారులు పేర్కొంటున్నారు. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి వచ్చిన పిలుపుతోనే ఆయన ఢిల్లీ వెళ్లినట్టు చర్చ జరుగుతోంది. అమిత్ షా ఇచ్చే అభయం మేరకు తదుపరి అడుగుల దిశగా పన్నీరు ముందుకు వెళ్లబోతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా, తమిళనాట అన్నాడీఎంకే – బీజేపీ కూటమిని బలోపేతం చేసే విధంగా అనేక పార్టీలతో చర్చలు జరిపి, వ్యూహాలకు పదును పెట్టే దిశగా బీజేపీ అధిష్టానం ఉత్తరాదికి చెందిన నేత విజయంత్‌పాండాను రంగంలోకి దించేందుకు నిర్ణయించినట్టు సమాచారాలు వెలువడ్డాయి.
వీఐటీ చైన్నెలో గుండె పనితీరును గుర్తించే ’చిప్’ రూపకల్పన
– కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రశంస
కొరుక్కుపేట: వీఐటీ చైన్నె సెంటర్ ఫర్ నానోఎలక్ట్రానిక్స్ అండ్ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్ బృందం మిశ్రమ –సిగ్నల్ రీడౌట్ ఇంటర్‌ఫేస్ (ఆర్‌ఓఐ) చిప్‌ను విజయవంతంగా రూపొందించి అభివద్ధి చేసింది. ఎంఈఎంఎస్ సెన్సార్ల ద్వారా వినియోగదారు హృదయ స్పందన రేటు, రక్తపోటు ఇతర కార్యకలాపాలను సమర్థంగా గుర్తించడానికి రూపొందించారు. చిప్ తయారు చేసిన తర్వాత, ఇటీవల మొ హాలిలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొని వీఐటీ–చైన్నె బృందానికి ప్రశంసలు తెలియజేశారు. దీనికి సంబంధించి, వీఐటీ ఉపాధ్య క్షుడు డాక్టర్ జి.వి. సెల్వం మాట్లాడుతూ, సామాజిక ప్రయోజనాల ఆధారంగా పరిశోధన లు జరుగుతున్నాయి. దాని ప్రధాన భాగంలో ప్రొఫెసర్లు, విద్యార్థులు సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఆ విష్కరణలను చేయడానికి కలిసి పనిచేస్తున్నారన్నారు. వైద్య రంగానికి అన్వయించగల పరిశోధ నలపై వీఐటీ చైన్నె దృష్టి పెరగడం వల్లే ప్రత్యేకమైన చిప్ విజయం సాధించిందని వీఐటీ చైన్నె ప్రో వైస్–చాన్స్‌లర్ త్యాగరాజ న్ అన్నారు.
డీఎంకే పాలనలో
శాంతిభద్రతలు క్షీణించాయి
కొరుక్కుపేట: డీఎంకే పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆరోపించారు. కళ్లకురిచ్చి కన్సర్ట్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి స్టాలిన్ వేదికపై చిరునవ్వుతో మాత్రమే మాట్లాడతారు. ఆయన తంజావూరులోని పొలాల్లో నడుస్తారు. కానీ రైతులకు చెరకు, పసుపు ధరలను ఆయన పెంచలేదు. అదేవిధంగా, వ్యవసాయం కోసం ఒక మండలిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఆ మండలిని ఏర్పాటు చేయలేదు. ముఖ్యమంత్రి స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌న్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని పార్టీని బలోపేతం చేశారు. డీఎంకే పాలనలో గంజాయి అమ్మకాలు పెరిగాయి. శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నియంత్రణలో పోలీసు శాఖ లేదన్నారు. 20 సంవత్సరాలకు ఒకసారి ఓటర్ల జాబితాను సవరించడం ఆనవాయితీ అని అన్నారు. ఈ మేరకే ప్రస్తుతం ఎస్‌ఐఆర్ జరుగుతోందన్నారు.
స్టార్టప్ హబ్‌గా ఐఐటీ మద్రాసు ఇంక్యుబేషన్ సెల్


