అంగమ్మాల్ అవార్డుల కోసం తీయలేదు!
తమిళసినిమా: యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రాల్లో వాస్తవికత ఉట్టిపడుతుంది. అదే విధంగా నటీనటుల నటనకు పదును పెడతాయి. అలాంటి యథార్థ సంఘటనలతో తెరకెక్కిన తాజా చిత్రం అంగమ్మాల్. తమిళనాడులోని ఒక గ్రామానికి చెందిన కుటుంబ నేపథ్యం ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రంలో టైటిల్ పాత్రను గీత కై లాసం పోషించారు. ఇతర ముఖ్య పాత్రల్లో శరణ్ శక్తి, నాడోడిగళ్ భరణి, తెండ్రల్, యశ్విన్, ముల్లైయరసీ, సుధాకర్ ముఖ్యపాత్రలు పోషించారు. విపిన్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మూలకథను రచయిత పెరుమాళ్ మురుగన్ అందించారు. ఫ్రేమ్స్ రహీం, అంజాయ్ సామువేల్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ఐంజాయ్ సామువేల్ చాయాగ్రహణం, ముహమ్మదు మక్బూల్ మన్సూర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ సంస్థ అధినేత కార్తికేయన్. ఎస్ మాట్లాడుతూ పలు భారీ చిత్రాలను నిర్మిస్తున్న తమ సంస్థ మంచి కంటెంట్‌తో కూడిన వైవిధ్య భరిత కథా చిత్రాలను, ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతికవర్గాన్ని ప్రోత్సహించే విధంగా ఈ అంగామ్మాళ్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కాగా ఇది అవార్డుల కోసం రూపొందించిన చిత్రమా అని అడుగుతున్నారని, నిజానికి అవార్డుల కోసం సినిమాలు తీయరని, మంచి, కథ, కథనాలతో కూడిన చిత్రాలకు అవార్డులు వరిస్తే సంతోషం అన్నారు.
అంగమ్మాల్ అవార్డుల కోసం తీయలేదు!


