ఆధునిక సాంకేతికతతో వినికిడి లోపానికి పరిష్కారం
సాక్షి, చైన్నె : అత్యాధునిక సాంకేతికతతో వినికిడి లోపానికి పరిష్కారంపై రేడియల్‌రోడ్డులోని కావేరి ఆస్పత్రి ఈఎన్‌టీ విభాగాధిపతి ఆనంద్ రాజు నేతృత్వంలో దృష్టి పెట్టారు. వినికిడి లోపంతో పోరాడుతున్న అన్ని వయస్సుల వారికి ఆశలు కల్పించే విధంగా అత్యాధునిక సాంకేతిక విధానాన్ని విజయవంతం చేశారు. మూడు సంక్లిష్టమైన కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సలను విజయవంతం చేశారు. తీవ్రమైన వినికిడి లోపంతో బాధ పడుతున్న ఇద్దరు పిల్లలు, ఒక పెద్ద వయస్సు వారికి ఈ చికిత్స జరిగింది. ఇందులో ఒకటి డౌన్ సిండ్రోమ్, మరొకటి వై కల్యం గా పిలవబడే పుట్టుకతో వచ్చే పరిస్థితి కావడం గమనార్హం. డాక్టర్ ఆనంద్ రాజు నాయకత్వంలో అత్యంత సవాలుతో కూడిన కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స నిర్వహించి పుట్టుకతో చెవిటి వాడైన ఓ బాలుడికి వినికిడి ఆనందాన్ని కల్పించినట్టు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. అలాగే మరో ఇద్దరికి వినికిడి అవకాశం దక్కిందని, ఈ అధునికత విధానం ప్రయోజనకంగా ఉంటున్నదని డాక్టర్ ఆనంద్ రాజు పేర్కొన్నారు.


