కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి
కొరుక్కుపేట: చైన్నె నగరంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అల్ ఇండియా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి చైన్నె ట్రిప్లికేన్ –చెప్పాక్కం నియోజకవర్గ సభ్యుల సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ విభాగాల పుననిర్మాణ కోసం సభ్యుల అభిప్రాయ సేకరణ జరిగింది. రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీని తమిళనాడులో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ట్రిప్లికేన్‌లోని తెలుగు ప్రముఖులు పి.పాల్ కొండయ్య అధ్యక్షతన పి. చిన్నయ్య, పి.అరుణ్ కుమార్ , పల్లిపాటి సతీష్ కుమార్, మహిళా కాంగ్రెస్ కు చెందిన అమ్ములు రఘువీరా రెడ్డికి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు తంగబాలు , కౌన్సిలర్లు ఎస్. శివరాజ శేఖర్ పాల్గొన్నారు.


