తిరువళ్లూరు జిల్లాలో భారీ వర్షం
తిరువళ్లూరు: ఆవడిలో జనజీవనానికి తీవ్ర ఇబ్బందికరంగా నిలిచిన వర్షపు నీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నెహ్రూ అధికారులను ఆదేశించారు. తిరువళ్లూరు జిల్లా ఆవడిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీంతో హౌసింగ్‌బోర్డు, కామరాజర్ నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లోని నివాసాలు నీటిలో మునిగిపోయింది. వర్షపు నీరు భారీగా నిలిచిపోయిన క్రమంలో వాటిని భారీ యంత్రాల ద్వారా తొలగింపు ప్రక్రియను అధికారులు వేగంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆవడిలో జరుగుతున్న వర్షపు నీరు తొలగింపు, సహాయక చర్యలను రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నెహ్రు, మైనారిటి సంక్షేమశాఖ మంత్రి నాజర్ , కలెక్టర్ ప్రతాప్ , కమిషనర్ శరణ్యతో పాటూ పలువురు పర్యవేక్షించారు. వర్షపు నీటిని తొలగించడంతో పాటు వర్షపు నీరు సులభంగా చెరువులకు వెళ్లేవిధంగా కాలువల పూడికతీత పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వం కల్పించిన శిబిరంలో వుంటున్న వరధ భాదితులను సైతం మంత్రులు కలిసి వారికి భరోసా ఇచ్చారు. పజలు ఆవడి, గుమ్మిడిపూండి, పొన్నేరి, రెడ్‌హిల్స్ తదితర ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల కొనుగోలుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్తితి ఏర్పడింది.
నిండిన 88 చెరువులు
దిత్వా తుపాను ఫలితంగా భారీ వర్షపాతం నమోదు కావడంతో జిల్లాలోని 88 చెరువులు పూర్తిస్థాయిలో నిండింది. జిల్లాలో పీడబ్ల్యూడీ అధీనంలో 250 చెరువులు వుండగా వీటిలో 88 చెరువులకు వందశాతం నీరు చేరింది. మరో 108 చెరువులకు 75 శాతం పైగా నీరు రాగ, 23 చెరువులకు 50 శాతం నీరు చేరినట్టు అధికారులు వెల్లడించారు.
పూర్తిగా నిండిన ఆనకట్టలు
జిల్లాలోని ప్రధాన ఆనకట్టలకు భారీగా వరధ నీరు రావడంతో నిండిపోయింది. పనపాక్కం, కల్పట్టు. చెంగాత్తుకుళం, పాళేశ్వరం, ఏఎన్‌కుప్పం, లక్ష్మాపురం, రెడ్డిపాళ్యం చెక్‌డ్యామ్‌లు పూర్తి స్థాయిలో నిండాయి.
ఆవడిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి నాజర్ తదితరులు
తిరువళ్లూరు జిల్లాలో భారీ వర్షం
తిరువళ్లూరు జిల్లాలో భారీ వర్షం
తిరువళ్లూరు జిల్లాలో భారీ వర్షం


