క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Dec 3 2025 7:57 AM | Updated on Dec 3 2025 7:59 AM

విద్యుత్‌ తీగలు తగిలి నెమలి మృతి

పళ్లిపట్టు: విద్యుత్‌ తీగలు రాజుకుని నెమలి ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది. పళ్లిపట్టు ప్రాంతంలోని కాప్పు అటవీ ప్రాంతంలో జింకలు, నెమళ్లు సంచరిస్తుంటాయి. ఇటీవల ఆహారం కోసం జనసంచార ప్రాంతాలకు వచ్చి వివిధ ప్రమాదాలకు గురై మృత్యువాతపడుతున్నాయి. ఈక్రమంలో నొచ్చిలి సమీపంలోని ప్రధాడ్డు వద్ద ఆహారం కోసం ఎగురుతూ వెళ్లిన నెమలికి విద్యుత్‌ స్తంభంలోని తీగలు తగిలి మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. 8 ఏళ్ల మగ నెమలి మృతికి సంబంధించి అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఫారెస్టర్‌ గోపి తన సిబ్బందితో చేరుకుని మృతిచెందిన నెమలిని తీసుకెళ్లి పోస్టుమార్టం కోసం పశువైద్యులకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ లాంచనాలతో నెమలికి పూడ్చిపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

హైగ్రేడ్‌ గంజాయి,

నక్షత్ర తాబేళ్లు సీజ్‌

అన్నానగర్‌: చైన్నె విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు థాయిలాండ్‌ నుంచి అక్రమంగా తీసుకువచ్చిన రూ. 1.5 కోట్ల విలువైన హై–గ్రేడ్‌ గంజాయిని, మలేషియా నుంచి అక్రమంగా తీసుకువచ్చిన నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. చైన్నెలోని మీనంబాక్కం అన్నా అంతర్జాతీయ విమానాశ్రయానికి థాయిలాండ్‌ నుండి మలేషియా మీదుగా వచ్చిన విమానం మంగళవారం వేకువజామున చేరుకుంది. విమానంలో ఉన్న ప్రయాణీకులను విమానాశ్రయ కస్టమ్స్‌ ఇంటెలిజెన అధికారులు నిశితంగా పరిశీలించారు. ఆ సమయంలో, ఉత్తర రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి వద్ద 3.42 కిలోలహై–గ్రేడ్‌, ప్రాసెస్‌ చేసిన గంజాయిని గుర్తించారు. అదేవిధంగా థాయిలాండ్‌ నుంచి మరో విమానంలో ప్రయాణిస్తున్న ఉత్తర రాష్ట్రానికి చెందిన 28 ఏళ్ల వ్యక్తి వద్ద 693 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి అంతర్జాతీయ విలువ దాదాపు రూ.1 కోటి 45 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. అలాగే మలేషియా నుంచి ఒక విమానం సింగపూర్‌ మీదుగా చైన్నె మీనంబాక్కం విమానాశ్రయానికి చేరుకుంది. పర్యాటక వీసాపై వచ్చిన మలేషియా యువకుడిని వద్ద కస్టమ్స్‌ అధికారులు 2,805 ఎర్రచెవుల నక్షత్ర తాబేళ్లను గుర్తించి సీజ్‌ చేశారు. నిందితుడిని అరెస్టు చేశారు.

పది నిమిషాలు ఆగిన మెట్రో సర్వీసు

కొరుక్కుపేట: సాంకేతిక లోపం కారణంగా మెట్రో సర్వీస్‌ నిలిపివేయడంతో ప్రయాణికులు సొరంగం గుండా నడుస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చైన్నె విమానాశ్రయం నుంచి విమానాశ్రయం వరకు వర్షాల కారణంగా సెంట్రల్‌ –హైకోర్టు మధ్య సొరంగంలో రైలు వెళుతుండగా అకస్మాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడింది. దీని కారణంగా మెట్రో ఆగిపోయింది. ప్రయాణికులు మెట్రో రైలు లోపల పది నిమిషాలపాటు చిక్కుకుపోయారు. తరువాత, మెట్రో సిబ్బందికి సమాచారం అందించి, మెట్రో తలుపులు తెరిచి, హైకోర్టు రైల్వేస్టేషన్‌ సొరంగం ద్వారా 500 మీటర్ల దూరంలో ఉండడంతో ప్రయాణికులు పట్టాలపై నడిచి వెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె

వేలూరు: లారీల ఎఫ్‌సీ రుసుమును పెంచడాన్ని ఖండిస్తూ దక్షణ భారత దేశంలో ఈనెల 9 నుంచి లారీలు సమ్మెలో పాల్గొననున్నట్లు దక్షణ భారత లారీ యజమానుల సంఘం తీర్మానం చేశారు. సంఘం సమావేశంలో వేలూరులోని ప్రయివేటు హోటల్‌లో జరిగింది. ఇందులో వివిద రాష్ట్రాలకు చెందిన లారీ యజమానుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి షణ్ముగప్ప విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లారీలు ఎఫ్‌సీ చేసుకునే రుసుమును రూ.850 నుంచి ఒకేసారి రూ.33,034కి పెంచాయన్నారు. ఈ పెంపు లారీ యజమానులను ఎంతగానో ప్రభావితం చేస్తుందన్నారు. ఆంధ్ర, తమిళనాడుకే పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో వ్యత్యాసం ఉంటున్నాయని వీటి గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రమం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో చర్చించి పరిష్కరించకుంటే ఈనెల 9 నుంచి సమ్మెలో పాల్గొంటామన్నారు. ఇందులో మొత్తం 12 లక్షల లారీలు సమ్మెలో పాల్గొంటాయన్నారు. ఆంధ్ర రాష్ట్ర లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వర్‌రావ్‌, రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌నాయుడు, సభ్యులు ఆర్‌వీ చినబాబు, ఆర్‌ శరత్‌, సంఘం సౌత్‌జోన్‌ అసోషియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు సెల్వకుమార్‌, లోకనాథన్‌,గోపాల్‌ , దొరైరాజ్‌, ధనరాజ్‌ పాల్గొన్నారు.

క్లుప్తంగా1
1/1

క్లుప్తంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement