తిరుత్తణి ఆలయానికి దిత్వా ప్రభావం
తిరుత్తణి: దిత్వా తుపాన్ ప్రభావంతో మూడు రోజుల నుంచి తిరుత్తణి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉండడంతో అర్ధగంటలో భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు. దిత్వా తుపాన్ ప్రభావంతో తిరుత్తణి ఆలయంలో ఆదివారం నుంచి మంగళవారం వరకు మూడు రోజుల పాటు భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. దీంతో తక్కువ సంఖ్యలో ఆలయంకు వచ్చిన భక్తులు అర్ధగంటలో నేరుగా ఆలయంకు వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. మురుగన్‌ను దర్శించుకునేందుకు మంగళవారం అనువైన రోజు కావడంతో స్థానికులు మంగళవారం ఉదయం స్వామి దర్శనం చేసారు. మధ్యాహ్నంకు తరువాత కాస్తా భక్తుల రద్దీ చోటుచేసుకుంది. కార్తీక దీపోత్సవం సందర్భంగా బుధవారం సాయంత్రం కొండ ఆలయ మాడ వీధిలో అశేష భక్తజనం నడుమ ఉత్సవర్లు వెండి నెమలి వాహనంలో కొలువుదీరనున్న క్రమంలో కార్తీక దీపం వెలిగిస్తారు. అదే సమయంలో కొండకు ఉత్తర దశలోని పచ్చిబియ్యం కొండలో 500 అడుగుల ఎత్తులో 150 కేజీల నెయ్యితో మహాదీపం వెలిగించనున్నారు. మహాదీపం దర్శించుకునే తిరుత్తణి పరిసర ప్రాంతాల ప్రుజలు తమ ఇళ్లలో కార్తీక దీపం వెలిగించనున్నారు.
తిరుత్తణి ఆలయానికి దిత్వా ప్రభావం


