విద్యుత్‌షాక్‌తో తండ్రీ కుమారులు మృతి
వేలూరు: విద్యుత్ షాక్‌తో ఓ తండ్రి, ఇద్దరు కుమారులు దుర్మరణం చెందారు. ఈ విషాదక సంఘటన వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఒడుగత్తూరు సమీపంలోని రామనాయకన్‌పట్టి గ్రామానికి చెందిన జానికిరామన్(55) వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ఇతని భార్య మల్లిక. వీరి కుమారులు వికాస్(25), లోకేష్(23), జీవ(22) ఉన్నారు. వికాస్‌కు వివాహం జరిగి ఒక కుమారుడున్నాడు. లోకేష్ బెంగుళూరులోని ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. జానకిరామన్, వికాస్, జీవ ముగ్గురూ కలిసి సొంత గ్రామంలో నర్సరీ పెట్టుకొని జీవిస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ సెలవుపై సొంత గ్రామానికి వచ్చాడు. సోమవారం రాత్రి జానికిరామన్ ముగ్గురు కుమారులతో కలిసి నర్సరీ వద్దకు వెళ్లారు. నర్సరీ సమీపంలోని వ్యవసాయ పొలంలో వెళుతున్న జానికిరామన్ కేకలు వేశాడు. ఇది చూసిన ముగ్గురు కుమారులు అక్కడికి వెళ్లారు. అక్కడ విద్యుత్ తీగల్లో చిక్కుకున్న తండ్రిని కాపాడేందుకు ముగ్గురూ ప్రయత్నించారు. విద్యుత్‌షాక్‌కు గురై జానకిరామన్, వికాస్, జీవ అక్కడికక్కడే మృతిచెందారు. లోకేష్ తీవ్రగాయాలతో ప్రాణాలతో బయట పడ్డారు. విషయం తెలుసుకున్న వేపంకుప్పం పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వేలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణలో అదే గ్రామానికి చెందిన రైతు శంకర్ తన వ్యవసాయ భూమిలో అటవీ జంతువులు రాకుండా ఉండేందుకు విద్యుత్ తీగలతో కంచె వేసినట్లు అందులో చిక్కుకుని ముగ్గురు మృతిచెందినట్లు తెలిపారు. పోలీసులు శంకర్‌ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.
విద్యుత్‌షాక్‌తో తండ్రీ కుమారులు మృతి
విద్యుత్‌షాక్‌తో తండ్రీ కుమారులు మృతి


