గౌతమ్ రామ్ కార్తీక్ హీరోగా నూతన చిత్రం
తమిళసినిమా: నటుడు గౌతమ్ రామ్ కార్తీక్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం ఆదివారం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా దర్శకుడు గణేశ్ కే.బాబు నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఈయన డాడా వంటి విజయవంతమైన చిత్రం ద్వారా దర్శకుడిగా పాపులర్ అయ్యారన్నది తెలిసిందే. ప్రస్తుతం ప్రస్తుతం కరాటే బాబు అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రాలను జరుపుకుంటోంది. కాగా తాజాగా నిర్మాతగా అవతారమెత్తిన గణేశ్ కే.బాబు డ్రాఫ్ బై జీకేబి అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి నటుడు గౌతమ్ రామ్ కార్తీక్ హీరోగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దినా రాఘవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈయన దర్శకుడు రాజుమురుగన్ శిష్యుడన్నది గమనార్హం. కాగా ఈ చిత్రానికి దర్శకుడు రాజు మురుగన్ మాటలను అందించారు. చిత్ర వివరాలను నిర్మాత గణేశ్ కే.బాబు తెలుపుతూ ఇది సమకాలీన రాజకీయాల ఇతి వృత్తంతో సాగే వినోదభరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు. వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తూ తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాధించికున్న నటుడు గౌతమ్ రామ్ కార్తీక్‌లో ఈ చిత్రంలో కథా పాత్రకు సరిపోయే ప్రతిభ, అర్హత ఉండటంతో ఆయన్ని హీరోగా ఎంపిక చేసినట్లు చెప్పారు.అదే విధంగా ఇందులో దర్శకుడు సెల్వరాఘవన్ వైవిధ్యభరిత కథా పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు. వీరితో పాటు నటి అంజనా నేత్రన్, రాబీ, పీ.వాసు, ఏ.వెంకటేశ్, మారన్, ఇందుమతి, ఆదిత్య కదీర్, భాగ్యం శంకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, ప్రదీప్ కలిరాజా ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు దర్శకుడు హెచ్,.వినోద్, రాజుమురుగన్, నిర్మాత ఫైవ్‌స్టార్ సెంథిల్‌కుమార్ తదితర సినీ ప్రముఖులు విశ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.
గౌతమ్ రామ్ కార్తీక్ హీరోగా నూతన చిత్రం


