ఘనంగా శక్తి గణపతి కుంభాభిషేకం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా శక్తి గణపతి కుంభాభిషేకం

Dec 2 2025 8:20 AM | Updated on Dec 2 2025 8:20 AM

ఘనంగా

ఘనంగా శక్తి గణపతి కుంభాభిషేకం

తిరుత్తణి: శక్తి గణపతి ఆలయ మహా కుంభాభిషేకం వేడుకలు సోమవారం కోలాహలంగా నిర్వహించారు. తిరుత్తణిలోని శేఖర్‌వర్మ నగర్‌లో శక్తి గణపతి ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టి, సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ నిర్మాణపు పనులు పూర్తి కావడంతో శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజులపాటు మహాకుంభాభిషేకం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం పరిసర ప్రాంతాలు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో యాగశాలలు ఏర్పాటు చేసి, నిత్య హోమగుండ పూజలు చేపట్టారు. సోమవారం ఉదయం మహాపూర్ణాహుతి హోమ పూజలు అనంతరం మేళతాళాలు నడుమ పవిత్ర పుణ్య తీర్థాల కలశాలు బయల్దేరి గోపుర కలశానికి వేదమంత్రోచ్ఛారణ నడుమ మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద గుమిగూడిన భక్తులపై పవిత్ర పుణ్యతీర్థాలు వెదజల్లారు. అనంతరం శక్తి గణపతికి అభిషేక పూజలు చేపట్టి, పుష్పాలంకరణలో దీపారాధన చేపట్టారు. భక్తులు స్వామిని దర్శించుకున్నారు. భక్తులందరికీ అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. మహాకుంభాభిషేకం వేడుకల్లో ఎమ్మెల్యే చంద్రన్‌, డీఎంకే మాజీ జిల్లా కార్యదర్శి భూపతి సహా అనేక మంది పాల్గొన్నారు.

రోబోటిక్‌ పోటీల సందడి

పాత్రల దుకాణం దగ్ధం

అన్నానగర్‌: కోయంబత్తూరులోని గణపతికి చెందిన శివకుమార్‌ స్థానికంగా పాత్రల దుకాణం నడుపుతున్నాడు. ఆదివారం, ఉద్యోగులు పని ముగించుకుని దుకాణానికి తాళం వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత, సోమవారం తెల్లవారుజామున, పాత్రల దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత, అకస్మాత్తుగా, దుకాణంలోని 5 సిలిండర్లు భయంకరమైన శబ్దంతో ఒకదాని తర్వాత ఒకటి పేలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కాని ఇందులో, దుకాణంలోని రూ. లక్షల విలువైన పాత్రలు, వస్తువులు కాలిపోయి ధ్వంసమయ్యాయి.

ఈవీ విభాగంలో

32 శాతం వృద్ధి

సాక్షి, చైన్నె: ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలో 3 శాతం వృద్ధిని నమోదు చేశామని జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటారు ఇండియా ప్రకటించింది. ఎంజీ సెలక్ట్‌ లగ్జరీ ఈవీ విభాగంలో రెండో స్థానాన్ని సాధించినట్లు స్థానికంగా సోమవారం ప్రకటించారు. సీవై–2024తో పోల్చితే జనవరి – నవంబర్‌ 2025లో 32 శాతం వార్షిక వృద్ధిని సాధించామని వివరించారు. 5754 యూనిట్ల అమ్మకాలు జరిగినట్టు పేర్కొన్నారు. ఎంజీ సెలక్ట్‌ ప్రారంభించినప్పటి నుంచి 1000 యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు ప్రకటించారు.

వరుడి మృతి

తిరువొత్తియూరు: రాణిపేట జిల్లా ఆర్కాటు అరుంబాక్కం గ్రామానికి చెందిన పెరియసామి, ఆనంది దంపతుల కుమారుడు అజిత్‌కుమార్‌ (27). వీరు చైన్నెలో ఉంటూ బిల్డింగ్‌ పనులు చేస్తున్నారు. వీరు పనిచేసిన అదే స్థలంలో కళ్లకురిచ్చికి చెందిన వధువు సంధ్య(23) కుటుంబం కూడా బిల్డింగ్‌ పనులు చేస్తోంది. రెండు కుటుంబాలకు స్నేహం ఏర్పడి బంధువులుగా కలిసిపోయారు. అరుంబాక్కం పెరియసామి తన కుమారుడు అజిత్‌కుమార్‌కు, సంధ్యను పెళ్లి చేసుకున్నారు. రెండు కుటుంబాల సమ్మతితో ఆదివారం ఉదయం 6 గంటల నుండి 7.30 గంటల మధ్య అజిత్‌కుమార్‌, సంధ్యలకు అరుంబాక్కంలోని కులక్కరై అమ్మన్‌ గుడిలో వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి అయిన సంతోషంలో వధూవరులు, బంధువులు ఉండగా, వరుడు అజిత్‌కుమార్‌, పెళ్లి దుస్తులతోనే గుడి పక్కన ఉన్న చెరువు దగ్గరికి మూత్ర విసర్జనకు వెళ్లారు. వెళ్లిన వ్యక్తి అరగంటకు పైగా తిరిగి రాకపోవడంతో, ఆందోళన చెందిన బంధువులు వెతకడం ప్రారంభించారు. అజిత్‌కుమార్‌ చెరువులో శవంగా తేలియాడుతూ కనిపించారు. ఇది చూసి వధువు కుటుంబం, వరుడి కుటుంబం తల్లడిల్లి ఏడ్చారు. అక్కడున్న ప్రజలందరి సహాయంతో శవాన్ని బయటకు తీశారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

హత్య కేసులో ముగ్గురి అరెస్టు

అన్నానగర్‌: కృష్ణగిరి సమీపంలో మహిళను ఆస్తి వివాదం కారణంగా హత్య చేసిన బంధువుతో సహా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను కర్రలతో కొట్టి, గొంతు నులిమి చంపారని వెల్లడైంది. కృష్ణగిరి మావత్తలోని పరకూర్‌ సమీపంలోని మెల్సిని నివాసపురం నివాసి మురుగన్‌. ఇతని భార్య గోవిందమ్మాళ్‌(56). మురుగన్‌ గతంలోనే మరణించాడు. దీని కారణంగా గోవిందమ్మాళ్‌ 25వ తేదీన 100 రోజుల పని ప్రాజెక్టులో భాగంగా 3 అంతస్తుల ఇంటి నిర్మాణం కోసం పనికి వెళ్లింది. అక్కడి కొండ దిగువన అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలో గోవిందమ్మాళ్‌ని కర్రతో కొట్టి, గొంతు నులిమి చంపారని శవపరీక్ష నివేదికలో తేలింది. దీని తరువాత నిందితులను అరెస్టు చేయడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణ సందర్భంగా ప్రత్యేక బృందం దిగ్భ్రాంతికరమైన సమాచారాన్ని విడుదల చేసింది. గోవిందమ్మాళ్‌ చనిపోయే ముందు, ఆమె భర్త మురుగన్‌ సుబ్రమణి వద్ద ఒక స్థలాన్ని కొనుక్కునేందుకు అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. ఆ భూమిని సుబ్రమణి నుండి, మురుగన్‌ అన్న పచ్చియప్పన్‌ కుమారుడు శక్తివేల్‌(44) కొన్నాడు. శక్తివేల్‌ తమ భూమిని కొనుగోలు చేయడంపై గోవిందమ్మాళ్‌ అతనితో తరచు వాగ్వాదం చేసేది. ఇంతలో శక్తివేల్‌ కొత్త ఇల్లు కట్టుకుని ఇంట్లోకి మారాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన గోవిందమ్మాళ్‌ శక్తివేల్‌ని అతనికి మద్దతుగా మాట్లాడిన వెంకటరామన్‌(65), గోవిందరాజ్‌(64)ను కూడా ఆమె అనుచిత పదాలతో దుర్భాషలాడింది. ఇది వారిని ఆవేశానికి గురిచేసింది. వారు గోవిందమ్మాళ్‌ని చంపాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రకారం, శక్తివేల్‌, వెంకట్రామన్‌, గోవిందరాజ్‌ అనే ముగ్గురు వ్యక్తులు గోవిందమ్మాళ్‌ను కర్రలతో కొట్టి, గొంతు నులిమి చంపినట్లు తెలిసింది. దీని తర్వాత, శక్తివేల్‌, వెంకట్‌ రామన్‌, గోవిందరాజ్‌లను ఆదివారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు.

– ఉత్తమ ప్రాజెక్టులకు బహుమతుల ప్రదానం

తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా ఆవడిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రోబోటిక్‌ పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి మూడు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు. తమ ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు. ఈ పోటీలు ఆవడిలోని ప్రైవేటు పాఠశాలలో నిర్వహించారు. ఈ ప్రదర్శనను దక్షిణ భారత వ్యాపార సంస్థ అధ్యక్షుడు థామస్‌ వర్గీస్‌ ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి, ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులు సైన్సుపై అవగాహన పెంచుకోవడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రాజెక్టులను రూపొందించడానికి ఆసక్తి ప్రదర్శించడం అభినందిచదగ్గ విషయమన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా పెరుగుతున్న క్రమంలో వాటికి తగ్గట్టు పరిశోధనలు నిర్వహించి, పొరుగు దేశాలకు సవాలుగా మారాలన్నారు. రోటోటిక్‌, ఎస్‌టీఈఎం, ఆర్టిఫిషియల్‌ ఇంజినీరింగ్‌, ఐఐటీతోపాటు ఇతర రంగాలకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉపయోగంపై సైతం ఆయన ప్రసగించారు. అనంతరం ఉత్తమ ప్రాజెక్టులను రూపొందించిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అతిథులుగా పాల్గొన్నారు.

వాలీబాల్‌ విజేతలకు బహుమతి ప్రదానం

పళ్లిపట్టు: వాలీబాల్‌ పోటీల్లో విజేతలను పళ్లిపట్టు సెంట్రల్‌ మండల డీఎంకే కార్యదర్శి బీడీ చంద్రన్‌ బహుమతులతో సత్కరించారు. డీఎంకే యువజన విభాగ కార్యదర్శి, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా కర్లంబాక్కంలో రెండు రోజులపాటు వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పది జట్లు పాల్గొన్నాయి. ఫైనల్‌ మ్యాచ్‌లో షోళింగర్‌ వెంకటాపురం జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఆటలో షోళింగర్‌ జట్టు విజేతగా నిలిచింది. బహుమతులు పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఇందులో పళ్లిపట్టు సెంట్రల్‌ మండల డీఎంకే కార్యదర్శి బీడీ చంద్రన్‌ పాల్గొని, విజేత జట్టుకు రూ.ఐదు వేలు బహుమతితోపాటు ట్రోఫీ అందజేసి, సత్కరించారు. అలాగే ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన జట్లను కూడా సత్కరించారు. ఇందులో విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్‌ మురళీసేన, యువజన విభాగం మండల సహాయ కన్వీనర్‌ దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

మృతి చెందిన కార్యకర్తకు రూ.10 లక్షల సాయం

కొరుక్కుపేట: ‘ప్రజలను రక్షించండి, తమిళనాడును కాపాడండి’ అనే నినాదంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ప్రతి జిల్లాలో తమిళనాడు అంతటా ప్రచార పర్యటన చేస్తున్నారు. దీని ప్రకారం, ఆదివారం రాత్రి ఈరోడ్‌ జిల్లాలోని గోపిచెట్టిపాళయం పక్కన ఉన్న నల్లకౌండన్‌ పాళయం ప్రాంతంలో పళనిస్వామి పాల్గొని ప్రసంగించారు. 50 వేలకు పైగా స్వచ్ఛంద సేవకు లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొండయ్యంపాలయంకు చెందిన అన్నాడీఎంకే కార్యకర్త అర్జునన్‌ (43) స్పృహ కోల్పోయి మరణించాడు. గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు కేసు నమో దు చేశారు. విషయం తెలుసుకున్న పళణిస్వామి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచిన అర్జునన్‌ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా పార్టీ తరపున రూ.10 లక్షల చెక్కు అందజేశారు.

ఘనంగా శక్తి గణపతి కుంభాభిషేకం 1
1/2

ఘనంగా శక్తి గణపతి కుంభాభిషేకం

ఘనంగా శక్తి గణపతి కుంభాభిషేకం 2
2/2

ఘనంగా శక్తి గణపతి కుంభాభిషేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement