రిటైర్డ్ ఉద్యోగులపై చిన్నచూపు తగదు
వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చిన్నచూపు చూడడం సరికాదని వేలూరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దీనదయాళన్ అన్నారు. ఆ సంఘం కార్యవర్గ సభ్యుల సమావేశం వేలూరులోని సంఘం కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 5వ తేదీన వేలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని పలు మార్లు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం సరికాదన్నారు. ఇప్పటికే పలు పోరాటాలు చేసినా, వినతిపత్రాలు సమర్పించినా స్పందించక పోవడం న్యాయం కాదన్నారు. సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ధర్నాలో జిల్లాలోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులంతా కలుసుకొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సమావేశంలో పలు తీర్మానాలను సభ్యులు నెరవేర్చారు. ఈ సమావేశంలో ఆ సంఘం కార్యదర్శి మనోహరన్, కోశాధికారి తిరునావకరసు, సమాచార విభాగం అధికారి రాజ, రాధాక్రిష్ణన్, పారిరాజన్ తదితరులు పాల్గొన్నారు.


