అంకాళమ్మకు ప్రత్యేక పూజలు
తిరువళ్లూరు: తిరుప్పాచ్చూర్‌లో ప్రసిద్ధి చెందిన శ్రీఅంకాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కుంభాభిషేకం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. తిరువళ్లూరు పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీఅంకాళపరమేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది. ఆలయానికి ఇటివల జీర్ణోద్ధరణ పనులను చేపట్టారు. పనులు పూర్తయిన క్రమంలో కుంభాభిషేకం కార్యక్రమానికి గత మూడు రోజుల క్రితం శ్రీకారం చుట్టారు. ఉత్సవాల్లో భాగంగా డున్నర గంటలకు గణపతి హోమం నిర్వహించి, ఆలయ గోపురంపై ఉన్న కలశంపై పుణ్యజలాలను వదిలి కుంభాభిషేకం నిర్వహించారు. ఉత్సవాలకు నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అన్నదానం చేశారు.


