దిత్వా తుపాన్‌తో అప్రమత్తం
తిరుత్తణి: దిత్వా తుపాన్ కారణంగా వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా హైవేశాఖ అధికారులు ఉపకరణాలు సిద్ధం చేశారు. దిత్వా ప్రభావం తిరువళ్లూరు జిల్లాపై చూపే అవకాశాలు వుండడంతో వాతావారణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా శాఖల వారీగా అధికారుల బృందం సిద్ధంగా వుండాలని ప్రభు త్వం ఆదేశించింది. దీంతో తిరుత్తణి హైవేశాఖ సహాయ ఇంజినీర్ రఘురామన్ ఆధ్వర్యంలో హైవే సిబ్బంది జేసీబీ వాహనాలు, చెట్లు కూలితే కొమ్మలను కోసి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉపకరణా లు, ఇసుక బస్తాలు సిద్ధం చేశారు. 24గంటలపాటు సమస్యలు అధికారుల దృష్టికి వస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా వున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ప్రాంతంలో చోటుచేసుకునే సమస్యలు పట్ల అధి కారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.


