రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు
– రాకపోకలకు అంతరాయం
తిరువళ్లూరు: దిత్వా తుపాన్ కారణంగా జిల్లాలో మోస్తరుగా వర్షం పడడంతో గుమ్మిడిపూండి జాతీయ రహదారిలో వర్షపు నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా దిత్వా తుపాన్ ప్రభావంతో మోస్తరుగా వర్షం కురిసింది. అత్యధికంగా పొన్నేరిలో 53మిమీ వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా ఆర్కేపేటలో నాలుగు మిమీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 289 మిమీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో గుమ్మిడిపూండి జాతీయ రహదారిలో వర్షపు నీరునిలిచింది. వర్షపు నీటిలో గుమ్మిడిపూండి సిప్‌కాట్ నుంచి వెలువడే కలుషిత నీరు కలిసిపోవడంతో దుర్వాసన వెదజల్లింది. కాగా రోడ్డులో నిలిచిన వర్షపు నీటితో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.


