మన జీవితం రాముని కథతో ముడిపడింది
కొరుక్కుపేట: మనిషి జీవితమంతా రాముని కథతో ముడిపడి ఉందని హైదరాబాద్‌కు చెందిన శతావధాని, ప్రవచనకర్త డాక్టర్ తాతా సందీప్ శర్మ అని అన్నారు. వేద విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక 167వ ప్రసంగంగా రామాభ్యుదయ కావ్య సౌందర్యం అనే అంశంపై ఆదివారం రాత్రి జరిగింది. దీనికి చైన్నె టీనగర్‌లోని ఆంధ్రాక్లబ్ కృష్ణా హాలు వేదికై ంది. కార్యక్రమానికి వక్తగా హైదరాబాద్‌కు చెందిన శతావధాని, ప్రవచనకర్త, సైన్‌న్స్ పరిశోధకులు డాక్టర్ తాతా సందీప్ శర్మ పాల్గొన్నారు. ముందుగా వేదవిజ్ఞాన వేదిక కార్యదర్శి కందనూరు మధు సందీప్ శర్మను ఘనంగా సత్కరించారు. సందీప్ శర్మ మాట్లాడుతూ తెలుగులో చాలా రామాయణాలు వచ్చాయని అన్నారు. తెలుగు ప్రబంధాల్లో అయ్యలరాజు రామభద్రుడి రామాభ్యుదయం విరాజిల్లిందని అభిప్రాయపడ్డారు. ఆదినారాయణరెడ్డి, రమేష్, సాహితీ ప్రియులు పాల్గొన్నారు.


