క్లుప్తంగా
ఆలయ హుండీ
చోరీ యత్నం
– ముగ్గురు బాలురు అరెస్టు
అన్నానగర్: తాంబరం సమీపంలోని ఇరుంపులియార్ తిరువల్లువర్ పురం ప్రధాన రహదారిపై శ్రీ గౌరీ అమ్మన్ ఆలయం ఉంది. శనివారం గుర్తుతెలియని వ్యక్తులు ఆలయం గేటును పగలగొట్టి, భక్తులు హుండీలో కానుకలుగా ఇచ్చిన డబ్బు, వస్తువులను దొంగిలించడానికి యత్నించారు. దీనితో దిగ్భ్రాంతి చెందిన స్థానికులు వెంటనే తాంబరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల దర్యాప్తులో ఆ ముగ్గురు 15, 16, 17 సంవత్సరాల వయస్సున్న బాలురని తేలింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
బైక్ కొనివ్వలేదని..
– పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య
అన్నానగర్: అడయార్‌లోని రామసామి గార్డెన్ ప్రాంతానికి చెందిన హరికరణ్ (18), పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి. ఈ స్థితిలో, ఇతను ఆదివారం తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించా డు. దీనితో దిగ్భ్రాంతి చెందిన అతని తల్లిదండ్రులు శాస్త్రి నగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు హరికరణ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కాగా ఇటీవల హరికరణ్ తన తల్లిదండ్రులను తనకు కొత్త బైక్ కొనాలని కోరాడు. అయితే కొన్ని నెలల తర్వాత అతనికి బైక్ కొంటామని చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన హరికరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడైంది. పోలీసులు ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సోమనాథస్వామి
ఆలయ కుంభాభిషేకం
కొరుక్కుపేట: చైన్నె కొలత్తూర్‌లోని 400 ఏళ్ల నాటి పురాతన ఆలయం సోమనాథస్వామి ఆలయం మహాకుంభాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. కుంభాభిషేకం జరిగి 12 ఏళ్ల అయిన సందర్భంగా రూ.2.29 కోట్ల ఆలయ నిధులు, రూ.71 లక్షల విరాళాలు సహా రూ. 3 కోట్లతో13 రకాల పునరుద్ధరణ పనులు చేశారు. ఈక్రమంలో ఆదివారం సోమనాథస్వామి ఆలయం కుంభాభిషేకం వేదమంత్రోచ్ఛరణల నడుమ జరిగింది. రాష్ట్ర హిందూ మత ధార్మిక శాఖ మంత్రి పి.కె. శేఖర్‌బాబు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా, 300 ఏళ్ల పురాతనమైన వెంకటచలపతి పరిపాల సభ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది, దానిని తొలగించి, కమిషనర్ ప్రజా సంక్షేమ నిధి నుంచి రూ.72 లక్షలతో పునర్నిర్మించారు. భక్తుల పూజల కోసం దీనిని ప్రారంభించారు. హిందూ ధర్మాదాయ శాఖ జాయింట్ కమిషనర్ ఎస్.మోహనసుందరం, ముల్లై, కార్పొరేషన్ జోనల్ కమిటీ చైర్మన్ సరితా మహేశ్‌కుమార్, అసిస్టెంట్ కమిషనర్ కె. భారతీరాజా, కార్పొరేషన్ సభ్యులు నాగరాజా, ఆలయ ధర్మకర్తల కమిటీ చైర్మన్ మోహన్ పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
15 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 14 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 79,791 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,911 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.73 కోట్లు సమర్పించారు. దర్శన టికెట్లు లేని వారికి దర్శతిరుమలలో ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. శ్రీవారి ఆలయ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది.
శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ రవి
తిరుమల: తిరుమల శ్రీవారిని ఆదివారం తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. టీటీడీ అధికా రులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.


