వరి నాట్లలో రైతులు బిజీబిజీ
వరినాట్ల పనుల్లో రైతులు
నారు నాటేందుకు సిద్ధంగా ఉన్న వరినారు
తిరుత్తణి: కార్తీక సీజన్ ప్రారంభం కావడంతో రైతులు వరినాట్ల పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. కార్తీక మాసం ప్రారంభంతో రైతులు వరి, వేరుశనగ సాగుకు ఆసక్తి చూపుతారు. వర్షాలు కురిసి నీటి సమస్య తలెత్తకపోవడంతో ఈ సీజన్‌లో వరి, వేరుశనగ పంట సాగు చేస్తారు. తిరుత్తణి, పళ్లిపట్టు, ఆర్కేపేట, తిరువలంగాడు ప్రాంతాల్లోని రైతులు పొలాలను దున్ని చదును చేసి నీరుకట్టి వరినాట్లకు నారు సిద్ధం చేస్తున్నారు. తిరుత్తణి యూనియన్‌లో 1,500 ఎకరాల్లో రైతులు వరి వేరువనగ సాగుకు పొలం దుక్కి దున్ని సిద్ధం చేసి వరినాట్లు వేసే పనులకు సిద్ధమయ్యారు. రైతులకు వరి విత్తనాలు వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ ధరలకు అందజేస్తున్నట్లు, రైతులు ఆధార్ కార్డు, పాస్‌బుక్ తీసుకొస్తే హెక్టార్‌కు 50 కేజీల వరి విత్తనాలు అందజేస్తున్నట్లు, రైతులు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు చెల్లించే అవకాశం కల్పించినట్లు వ్యవసాయ శాఖ సహాయ డైరెక్టర్ ప్రేమ్ తెలిపారు.
వరి నాట్లలో రైతులు బిజీబిజీ


