వైభవం..అయ్యప్ప పడి పూజలు
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కమ్మవారిపాళ్యంలో అయ్యప్పస్వామి పడి పూజలు వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా బీజేపీ జిల్లా కన్వీనర్ పన్నీర్‌సెల్వం ఆద్వర్యంలో అయ్యప్పస్వామి పడిపూజలు శనివారం రాత్రి జరిగాయి. ముందుగా అయ్యప్పస్వామి, గణపతి, శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అలంకరించారు. రెండు వేలకు పైగా అయ్యప్పస్వామి మాలధారణ చేసిన భక్తులు హాజరై పూజల్లో పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం, ప్రసాదాలను నిర్వాహకులు అందజేశారు. ఏర్పాట్లను బీజేపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ లయన్ పన్నీర్‌సెల్వం ఏర్పాటు చేయగా, అన్నాడీఎంకే మాజీ మంత్రి రమణ, పీఎంకే రాష్ట్ర ఉప కార్యదర్శి బాలయోగీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు లోకనాతన్, ఓబీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజ్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకరన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు తిరుత్తణి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆర్యశ్రీనివాసన్ పాల్గొన్నారు. వీరమణిరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప భక్తి గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి.


