ఆవిష్కర్తలకు ప్రత్యేక గుర్తింపు
సాక్షి, చైన్నె: పరిశోధన, కొత్త ఆవిష్కరణ, మార్గదర్శకత్వం, ఇంక్యుబేషన్ మార్గాలకు మద్దతు ఇచ్చే విధంగా ఆవిష్కర్తలకు ప్రత్యేక గుర్తింపు, ప్రోత్సాహం అందించనున్నామని వీఎంఆర్‌ఎఫ్‌డీయూ చాన్స్‌లర్ ఏఎస్ గణేషన్ తెలిపారు. ఏవీఐటీ నేతృత్వంలో సిల్వర్ స్పార్క్ 2025 పేరిట ఆవిష్కరణ, వ్యవస్థాపక ఆలోచనలను పెంపొంచే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏవీఐటీ ప్రిన్సిపల్ డాక్టర్ జె జానెట్ తన ప్రసంగంలో విద్యార్థుల ఆవిష్కరణ, పర్యావరణ వ్యవస్థల బలోపేతం గురించి వివరించారు. వీఎంఆర్‌ఎఫ్ డీయూ చాన్స్‌లర్ ఎఎస్ గణేషన్, ఉపాధ్యక్షురాలు అనురాధాలు మాట్లాడుతూ, విద్యార్థులు వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ సాంకేతికత, స్థిరత్వం,డిజిటల్ వంటి విభిన్న ఇతి వృత్తాలలో పరిష్కారాలు,పరివర్తన, అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.ఉత్తమ ఆవిష్కర్తలకు ప్రోత్సాహం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈసందర్భంగా జరిగిన ది సిల్వర్ స్పార్క్ 2025 ఐడియాథాన్‌లో భాగంగా వినూత్న,సరికొత్త ఆవిష్కరణలకు నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ విద్యాసంస్థ వీసీ డాక్టర్ పీకే సుధీర్, ఐఐఈ,ఐసీ డైరెక్టర్ డాక్టర్ పి.జ్ఞాన శేఖర్, వైస్ ప్రిన్సిపల్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.


