ఐఐటీ మద్రాసులో ఈడీసీ 360 డిగ్రీ కాన్కేలవ్
సాక్షి, చైన్నె: పీఏఎల్‌ఎస్ వ్యవస్థాపకతపై ఈడీసీ 360 కాన్క్లేవ్‌కు ఐఐటీ మద్రాసు చర్యలు చేపట్టిది. ఇందులో భాగంగా ఈ అభివృద్ధిని కాంక్షిస్తూ పరిశ్రమ, విద్యా వేత్తల మధ్య సత్సంబంధాలు, ఆవిష్కరణలు,స్టార్టప్‌ల పర్యావరణ వ్యవస్థపై దృష్టి పెట్టే విధంగా ఒప్పందాలు జరిగాయి. ఐఐటీ పూర్వ విద్యార్థుల నేతృత్వంలో స్వచ్ఛందం చొరవగా పీఎఎల్‌ఎస్, ఈడీసీ 360 డిగ్రీని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఐఐటీ మద్రాసు వ్యవస్థాపక అభివృద్ధిపై జరిగిన సమావేశంలో 40 దార్శనిక ఇంజినీరింగ్ సంస్థల నుంచి సీనియర్ ప్రతినిధులు ఈ సమావేశం నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఇంజినీరింగ్ కళాశాలలో బలమైన వ్యవస్థాపకత, ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థలు, భవిష్యత్తు అంశాలపై ఇందులో దృష్టి పెట్టారు.ఇ ందులో భాగంగా జరిగిన ఒప్పందాలపై టెక్నాలజీ అండ్‌ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ల్యాబ్స్, ఐఐటీ మద్రాసు, ఏఐసీ అన్నా ఇంక్యుబేటర్ ప్రతినిధులు సంతకాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఐటీఈఎల్ చైర్మన్ ప్రొఫెసర్ అశోక్ , మహీంద్రా టెక్నాలజీ ఉపాధ్యక్షుడు శంకర్ వేణుగోపాల్‌తో పాటుగా ఐఐటీ పూర్వవిద్యార్థుల చారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన తమిళనాడు, కేరళ, ఆంధ్రా,కర్ణాటక, తెలంగాణలకు చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.


