ఘనంగా ఓబుల్ రెడ్డి శత జయంతి
కొరుక్కుపేట: పారిశ్రామిక వేత్త పి.ఓబుల్‌రెడ్డి శాసీ్త్రయ కళలను పరిపోషించారని అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్ పద్మవిభూషణ్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి అన్నారు. ఈమేరకు పారిశ్రామిక వేత్త ఓబుల్ రెడ్డి శతజయంతి వేడుకలను చైన్నెలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఓబుల్ రెడ్డి శతజయంతిని పురష్కరించుకుని ఇండియా పోస్టు స్మారక మై స్టాంప్‌ను ఆవిష్కరించింది. డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి సమక్షంలో చైన్నెలోని పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్, ఐపీఓఎస్ మేజర్ మనోజ్ ఆవిష్కరించారు. ప్రతాప్ సి రెడ్డి మాట్లాడుతూ పారిశ్రామిక రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి ఎందరికో ఆయన ఆదర్శంగా నిలిచారన్నారు. భారతీయ శాసీ్త్రయ కళల పోషణకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఓబుల్ రెడ్డి వారసత్వాన్ని గౌరవిస్తూ ఏడాది పొడవునా జరిగే శతాబ్ది ఉత్సవాల్లో మై స్టాంప్ విడదల కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అపోలో ఆస్పత్రి డాక్టర్ ప్రీతారెడ్డి, సునీతరెడ్డి, ఓబుల్‌రెడ్డి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.


