వంకాయ కిలో ధర రూ.120
న్యూస్‌రీల్
కొరుక్కుపేట: వర్షాల నేపథ్యంలో దిగుబడి తగ్గడం, మార్కెట్లకు సరుకు రాకపోవడంతో కూరగాయలకు రెక్కలు వచ్చాయి ఇప్పటికే మునగకాయల ధరల ఆకాశానికి అంటగా, దాని తర్వాత వంకాయల ధరలు కిలో రూ.120 వరకు విక్రయిస్తున్నారు. గత కొంతకాలంగా ముఖ్యంగా టమాటాలు, ఉల్లిపాయలు, మునగకాయల ధరలు పెరిగాయి. ఈ పరిస్థితిలో వంకాయల ధరలు కూడా పెరిగాయి. తూత్తుకుడి జిల్లాలోని తిరుచెందూర్, ఉదుకుడి , సాతంకులం, తిరునల్వేల్లి జిల్లాలోని ఉల్లతిశయన్విలై చుట్టుపక్కల ప్రాంతాలలో సుమారు 2,000 ఎకరాల విస్తీర్ణంలో మునగకాయల సాగు చేస్తారు. సాతంకులం ప్రాంతంలో మునగకాయలకు ప్రత్యేక మార్కెట్ ఉంది.ఇక్కడ స్థానికంగా మునగకాయల సాగు ఎక్కువగా ఉంది. ఇది మంచి దిగుబడిని ఇస్తుంది. నిరంతర భారీ వర్షాల కారణంగా చెట్ల నుండి రసం కారుతోంది. పువ్వులు , మొగ్గలు గాలికి రాలిపోతున్నాయి, ఫలితంగా దిగుబడి భారీగా తగ్గుతుందని రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో వంకాయ ఉత్పత్తి కూడా పెరిగింది. ఆ విషయంలో వంకాయ ధర రూ.120కి పెరిగింది. ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో కూరగాయల సరఫరా కనీసం మూడో వంతు తగ్గింది. ఆ కారణాల వల్ల, చైన్నెలోని కోయంబేడు మార్కెట్‌తో సహా వివిధ మార్కెట్లలో కూరగాయల ధరలు బాగా పెరిగాయి. ఈ ధరల పెరుగుదల మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు పెర్కొంటున్నారు.
మాంగాడు పోలీసు
ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్
– ఆవడి నగర పోలీస్ కమిషనర్ ఆదేశం
అన్నానగర్: సైబర్ నేరానికి సహాయం చేశాడనే ఫిర్యాదు మేరకు ఆవడి మెట్రోపాలిటన్ పోలీసులు మాంగాడు పోలీస్ ఇనన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ ఆవగి నగర కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. మాంగాడు పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్‌గా నాలుగురోజుల క్రితం సుధాకర్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇతడు చైన్నెలో సైబర్ క్రైమ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేశాడు. ఈనేపథ్యంలో ఆవడి నగర పోలీసు కమిషనర్ శంకర్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. గతంలో ఒక సైబర్ క్రైమ్ నేరస్తుడికి సహకరించిట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
ఎస్‌ఐఆర్ దరఖాస్తు గడువు పెంపు
– డిసెంబరు 11 వరకు స్వీకరణ
సాక్షి, చైన్నె: ఎస్‌ఐఆర్ దరఖాస్తులను స్వీకరణ గడువును పొడిగించారు. డిసెంబరు 11వ తేదీ వరకు ఓటర్లు దరఖాస్తును పూర్తి చేసి సమర్పించే విధంగాఎన్నికల కమిషన్ వెసులు బాటు కల్పించింది. రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ నవంబర్ 4వ తేదీన నుంచి జరుగుతున్న విషయం తెలిసిందే. డీఎంకే కూటమితో పాటుగా టీవీకే ఈ ప్రక్రియను ఆది నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. పోరాటాలు సైతం జరిగాయి. బీఎల్‌ఓలు అనేక చోట్ల ఈ ప్రక్రియను వ్యతిరేకించే విధంగా విధుల బహిష్కరణ, నిరసనలు కొనసాగిస్తున్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ కోసం అందజేస్తున్న దరఖాస్తులను పూరించడం కష్టతరంగా ఉందన్న ఆవేదనను ఓటర్లు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గతంలో ఉన్న సమాచారాలు, తల్లిదండ్రుల సమాచారాలు, వారి ఓటరు ఐడీ వివరాలను కోరుతుండడం ఇందుకు సమస్యగా మారింది. దరఖాస్తులను ఇంటింటా బీఎల్‌ఓలు అందజేసినా, తిరిగి సమర్పించడంలో ఓటర్లు ఆసక్తి చూపించడం లేదు. దీంతో దరఖాస్తులు స్వీకరణ సమస్యగా మారింది. ఈ దృష్ట్యా, ఎస్‌ఐఆర్ దరఖాస్తులు ఓటర్లకు డిసెంబరు నాలుగో తేది వరకు మాత్రమే బీఎల్‌ఓలు అందజేయనున్నారు. పూర్తి చేసిన దరఖాస్తులకు చివరి రోజు నాలుగో తేదీ అని ముందుగా నిర్ణయించినా, తాజాగా సమయాన్ని పొడిగించారు. డిసెంబరు 11 వతేదీ వరకు పూర్తిచేసిన దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇందుకు గాను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేకఅవకాశం కల్పించింది. నమూనా ఓటరు జాబితాను డిసెంబరు 16 తేదీన ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.


