ఘనంగా సోపాన్ 2025 వేడుకలు
– విద్యార్థులకు బహుమతులు
సాక్షి, చైన్నె: అన్నాదురై శత జయంతి స్మారక గ్రంథాలయం వేదికగా సోపాన్ 2025 విజేతలకు ఆదివారం బహుమతులను ప్రదానం చేశారు. అల్లెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ వార్షిక విజయోత్సవ వేడుకగా సోపాన్ 2025 వేడుకను నిర్వహించారు. ప్రముఖ జాతీయ సంస్థలలో ప్రవేశాలు పొందిన, ఒలింపియాడ్‌లలో విజేతలుగా నిలిచిన చైన్నెలోని అత్యుత్తమ విద్యార్థులను ఈ వేడుకలో సత్కరించారు. ఐఐటీలో 51 మంది, ఎన్‌ఐటీలో 33 మంది, ఐఐఐటీలో 18 మంది, ఐఐఎస్‌ఈఆర్‌లో ముగ్గురు అంటూ ఉత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ట్రోఫీలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అల్లెన్ తెలంగాణ హెడ్ సౌరవ్ తివారీ, మదురై అధ్యక్షుడు శ్రీనివాస పెరుమాల్, తమిళనాడు,పాండిచ్చేరిఅధ్యక్షుడు సంతోష్ సింగ్, ఏజీఎం కిషన్ వెంకట్ , ఉపాధ్యక్షుడు మహేశ్ యాదవ్, ఆవడి పోలీసు కమషనర్ కె శంకర్, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ మితిలేష్ కుమార్ తదితరులు హాజరై విద్యార్థులను సత్కరించి, బహుమతులు అందజేశారు.


