థియేటర్లలో సందడి చేస్తున్న తేరే ఇష్క్ మే
తేరే ఇష్క్ మే చిత్రంలో క్రితీ సనన్,
ధనుష్
తమిళసినిమా: నటుడు ధనుష్ స్థాయి దక్షిణాదిని దాటి చాలా కాలమే అయ్యింది. అంతేకాదు అది హాలీవుడ్ వరకు వెళ్లింది. తమిళంతో పాటూ తెలుగు, హిందీ, ఆంగ్లం చిత్రాల్లో నటిస్తూ పాన్ వరల్డ్ హీరోగా పేరు తెచ్చుకున్న ధనుష్ 2013లో కథానాయకుడిగా నటించిన హిందీ చిత్రం రాంజాన మంచి విజయాన్ని అందుకుంది. అంతకుముందే ఈయన నటుడు అమితాబ్ బచ్చన్‌తో కలిసి షమితాబ్ చిత్రంలో నటించారు. కాగా రాంజాన చిత్రానికి దర్శకత్వం వహించిన ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తాజాగా ధనుష్ కథానాయకుడిగా నటించిన చిత్రం తేరే ఇష్క్ మే. నటి క్రితీ సనన్ నాయికగా నటించిన ఇందులో ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. భూషణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ప్రేమ, దేశం కోసం త్యాగం వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం ఇది. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చింది. నటుడు ధనుష్ పాత్ర కళాశాల విద్యార్థి, ప్రేమికుడు,యుద్ద విమాన పైలెట్ అంటూ 3 కోణాల్లో సాగే ఇందులో ఆయన నటన మరోసారి ప్రేక్షకులను అలరించే విధంగా ఉంది. అదేవిధంగా నటి క్రితీ సనన్ ఆయనకు దీటుగా నటించారనే చెప్పాలి. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం పక్క బలంగా అదిరింది. కీబేర, ఇడ్లీకడై వంటి విజయవంతమైన చిత్రాల తరువాత ధనుష్ నటించిన చిత్రం కావడంతో తేరే ఇష్క్ మే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటిని ఈ చిత్రం రీచ్ అవుతుందో చూడాలి.
థియేటర్లలో సందడి చేస్తున్న తేరే ఇష్క్ మే


