ఆయనే నాకు స్ఫూర్తి
తమిళసినిమా: దర్శకుడు విజయ్ ఇంతకుముందు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డి స్టూడియోస్ పోస్ట్ అని సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ స్టూడియోలో రికార్డింగ్, రీ రికార్డింగ్, డబ్బింగ్, ఎడిటింగ్, సౌండింగ్, స్పెషల్ ఎఫెక్ట్ పంటి చిత్రాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ స్టూడియో నిర్వహణలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వేల్స్ ఫిలిమ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ భాగస్వామ్యమైంది. ఇప్పటికే ఎన్నో భారీ చిత్రాలను నిర్మించిన వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ అధినేత ఐసరి గణేష్, దర్శకుడు విజయ్ కలిసి ఈ సంస్థ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. దర్శకుడు విజయ్ మాట్లాడుతూ ఇండియన్ సినిమా గుండె చైన్నెనేనని పేర్కొన్నారు. చైన్నెలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డి స్టూడియో పేరుతో ఏర్పాటు చేయాలనే ఆలోచనకు ఊతం ఇచ్చిందన్నారు. నిర్మాత ఐసీ గణేష్ తనకు ఈ రంగంలో స్ఫూర్తిగా పేర్కొన్నారు. అలాంటి ఆయనతో కలిసి భవిష్యత్తులో వేల్స్ ది స్టూడియో సంయుక్తంగా తమిళ సినిమాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.


